చిరంజీవి, కొరటాల గురించి పచ్చి అబద్దాలు.. దుమ్ము దుమారమే!
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్నారు. ఖైదీ నెం 150 చిత్రంతో రికార్డులు తిరగరాసిన చిరు ఇప్పుడు సైరా చిత్రంతో సంచలనానికి తెరతీశారు. సురేందర్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న సైరా చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సైరా చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమాలపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో సినిమా చేయడానికి బడా దర్శకులు ఎగబడుతున్నారు. చిరంజీవి త్వరలో వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పుకార్లు మొదలయ్యాయి. ఆ పుకార్లకు చెక్ పెడుతూ తాజాగా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

తిరుగులేని దర్శకుడు
మిర్చి చిత్రంతో మొదలైన దర్శకుడు కొరటాల శివ జైత్ర యాత్ర శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలతో కొనసాగింది. కొరటాల దర్శత్వం వహించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో ఈ దర్శకుడుతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. కొరటాల శివ తన తదుపరి చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవికి సరిపోయే అద్భుతమైన కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అసత్య ప్రచారం
కొరటాల సిద్ధం చేసిన కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి పుకార్లు మొదలయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే అసత్య ప్రచారం మొదలైంది. చిరంజీవి, కొరటాల చిత్రం కొన్ని కారణాల వలన ఆగిపోయిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనితో కొరటాల మహేష్ బాబుతో హ్యాట్రిక్ మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపించింది.

పుకార్లకు అడ్డుకట్ట
తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల, చిరంజీవి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. కొరటాల శివ కథకు తుది మెరుగులు దిద్దుతున్నారట. అన్నీ కుదిరితే జనవరిలో ఈ చిత్రం పార్రంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారీ యాక్షన్ సన్నివేశాలు
కొరటాల శివ చిత్రం అంటే కళ్ళు చెదిరే కమర్షియల్ అంశాలతో పాటు చక్కటి సందేశం కూడా ఉంటుంది. చిరంజీవి చిత్రానికి కూడా కొరటాల అదే ఫార్ములా ఉపయోగించబోతున్నారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పాటు రైతు సమస్యలకు సంబంధించిన చక్కటి సందేశం కూడా ఈ చిత్రంలో ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి రైతు పాత్రలో నటిస్తారట.


Click it and Unblock the Notifications











