అనుకోకుండా తన సినిమా పేరును రివీల్ చేసిన చిరంజీవి.. కొరటాల శివకు సారీ చెప్పిన మెగాస్టార్.!
రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూకుడును ప్రదర్శిస్తున్నారు. వరుసగా సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా.. చిన్న చిన్న సినిమాలను సైతం ప్రోత్సహించేందుకు ఆయా ఈవెంట్లకు వెళ్తున్నారు. అలాగే, పెద్ద స్టార్ల మూవీల కోసమూ తరలి వెళ్తున్నారు. అంతేకాదు, పరిశ్రమలో ఏది జరిగినా ముందుంటున్నారు. దీంతో ఎక్కడ చూసిన మెగాస్టారే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో చిరంజీవి తన సినిమా పేరును అనుకోకుండా రివీల్ చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

కమ్‌బ్యాక్ అదిరింది.. రెండో స్టెప్ చెదిరింది
‘ఖైదీ నెంబర్ 150' అనే సినిమాతో చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. అంతేకాదు, చిరులో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని నిరూపించింది. అయితే, కమ్‌బ్యాక్ తర్వాత ఆయన నటించిన రెండో సినిమా ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం నిరాశనే మిగిల్చింది. దీన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించిన విషయం తెలిసిందే.

బడా డైరెక్టర్‌తో మరో భారీ ప్రాజెక్టు ప్లాన్
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘సైరా' నిరాశనే మిగల్చడంతో మెగాస్టార్ తన తదుపరి సినిమాను బడా డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. సోషల్ మెసేజ్‌తో కూడిన సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా మ్యాట్నీ మూవీస్ సంస్థ భాగస్వామ్యంతో రామ్ చరణే నిర్మిస్తున్నారు.

అప్పుడు పవన్... ఇప్పుడు చిరంజీవి
దేవాలయ భూముల ఆక్రమణలను మెయిన్ పాయింట్‌గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీన్ని కూడా తన గత చిత్రాల్లానే సోషల్ మెసేజ్‌తో రూపొందిస్తున్నాడట కొరటాల శివ. అందుకోసమే ఇందులో చిరు.. మావోయిస్టుగా కనిపిస్తున్నారట. గతంలో జల్సా సినిమా కోసం పవన్ కూడా మావోయిస్టుగా నటించాడు.

రామ్ చరణ్ పాత్రను మహేశ్ చేస్తున్నాడు
ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అది కూడా సినిమాను మలుపు తిప్పే పాత్రలో అని అన్నారు. అయితే, ఇటీవల ఈ సినిమాలో చరణ్ బదులు మహేశ్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. 40 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర కోసం అతడు భారీగానే చార్జ్ చేస్తున్నాడని అంటున్నారు.

సినిమా పేరును రివీల్ చేసిన చిరంజీవి
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు మొదట ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ అనుకున్నారు. కానీ, ఇటీవల ఈ టైటిల్‌ను ‘ఆచార్య'గా కుదించారని ప్రచారం జరుగుతున్నా.. చిత్ర యూనిట్ మాత్రం దీనిని కన్ఫార్మ్ చేయలేదు. అయితే, తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో చిరు.. తన సినిమా పేరును ‘ఆచార్య' అని అనుకోకుండా రివీల్ చేశారు. దీంతో అందరూ షాక్ అయ్యారు.
Recommended Video


కొరటాల శివకు సారీ చెప్పిన మెగాస్టార్.!
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కొడుకు హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓ పిట్ట కథ'. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అక్కడ మాట్లాడుతూ చిరంజీవి తన సినిమా పేరును రివీల్ చేశారు. అంతేకాదు, జరిగిన పొరపాటుకు ఆయన డైరెక్టర్ కొరటాల శివకు అందరి ముందే సారీ చెప్పారు. దీంతో మెగా అభిమానులతో పాటు అక్కడున్న వారు ‘ఆచార్య.. ఆచార్య' అంటూ కేకలు పెట్టారు.


Click it and Unblock the Notifications











