జగదేకవీరుడి చుట్టూ అలనాటి సుందరాంగులు.. వెంకటేష్ కుమార్తె రిసెప్షన్‌లో చిరు, ప్రభాస్!
Recommended Video

విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వివాహం ఇటీవల వైభవంగా జరిగింది. గురువారం రోజు రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి సెలెబ్రిటీలంతా ఆశ్రిత రిసెప్షన్ కు హాజరు కావడం విశేషం. రిసెప్షన్ వేడుకలో ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్, ఆశ్రిత వివాహం మార్చి 24న జైపూర్‌లో జరిగింది.

సినీతారల సందడి
హైదరాబాద్ లో నిర్వహించిన రిసెప్షన్ కు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి సెలెబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో అలనాటి హీరోయిన్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చిరు, ప్రభాస్, కృష్ణం రాజు లాంటి సెలెబ్రిటీల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జగదేకవీరుడి చూట్టూ
ఈ రిసెప్షన్ లో చోటు చేసుకున్న కొన్ని దృశ్యాలు అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలనాటి హీరోయిన్లు రాధిక, సుహాసిని, ఖుష్బూ, మీనా, టబు, నదియా, జయసుధ తదితరులు రిసెప్షన్ లో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలసి ఈ హీరోయిన్లతా దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో కూడా వీరు ఫోటో దిగారు.

హ్యాండ్సమ్ మెగాస్టార్
హ్యాండ్సమ్ మెగాస్టార్ చుట్టూ అందమైన మహిళలు అంటూ ఖుష్బూ ట్వీట్ చేసింది. ఈ సాయంత్రం ఎంతో మధురమైన జ్ఞాపకాలని మిగిల్చింది. చిరంజీవి, కృష్ణం రాజుతో సరదాగా గడిచింది అని రాధిక సోషల్ మీడియాలో పేర్కొంది. రాధిక, సుహాసిని, మీనా, ఖుష్బూ లాంటి నటీలంతా వెంకటేష్, చింరజీవితో కలసి నటించినవారే.

సింపుల్‌గా ప్రభాస్
ఆశ్రిత రిసెప్షన్ వేడుకలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సింపుల్ గా కనిపించాడు. సమంత నాగచైతన్య దంపతులు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో రానా దగ్గుబాటి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నాడు.


Click it and Unblock the Notifications











