‘రేసు గుర్రం’ ఆడియో వేడుకకు చిరంజీవి
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రేసు గుర్రం'. ఈ చిత్రం ఆడియో వేడుక ఈ నెల 16న జరుగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ నెట్వర్కింగు ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేసారు.
'చాలా ఆనందంగా ఉంది. రేసు గుర్రం ఆడియో వేడుకకు చిరంజీవి గారు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు' అంటూ బన్నీ తన సోషల్ నెట్వర్కింగు ద్వారా తెలియజేసారు. సాధారణంనే బన్నీ సినిమా ఆడియో వేడుక అంటే అభిమానులు భారీగా వస్తారు. మెగాస్టార్ కూడా వస్తుండటంతో ఆ ఆడియో వేడుకపై మరింత క్రేజ్ ఏర్పడింది.

అల్లు అర్జున్-శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రేస్ గుర్రం'. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ముందుగా అనుకున్న ప్రచారం ఈ సినిమా ఆడియో 14వ తేదీన జరుగాల్సి ఉండగా...అదే రోజు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేన ఆవిర్భావ సభ పెట్టడంతో 16వ తేదీకి ఆడియో విడుదల వాయిదా వేసారు. ఈ సినిమా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శృతి హసన్, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











