ఆచార్య కథను లీక్ చేసిన చిరంజీవి.. రానాతో షేర్ చేసుకొన్న మెగాస్టార్...

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కార్యక్రమాల్లోనైనా మనసులో ఏదీ దాచుకోకుండా భావాలు వెల్లడించడంలో మెగాస్టార్ చిరంజీవి తన మార్కును చూపిస్తారు. సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్‌లోనైనా ఉన్నది ఉన్నట్టు చెబుతుంటారు. కొన్నిసార్లు బయటకు చెప్పకూడని విషయాలు చెప్పేసి.. నేను ఇలా చెప్పానేంటి అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అయితే తాజాగా ఆచార్య సినిమా గురించి మెగాస్టార్ మరోసారి ఏం చెప్పారంటే...

 పిట్టకథ సినిమా ఫంక్షన్లో

పిట్టకథ సినిమా ఫంక్షన్లో

గతంలో పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తాను నటిస్తున్న కొరటాల శివ సినిమా గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఇంకా టైటిల్ ప్రకటించలేదు. కానీ ఆ వేదిక మీద తాను నటిస్తున్న ఆచార్య సినిమా అంటూ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు.

ఆచార్య టైటిల్‌ను లీక్ చేసి..

ఆచార్య టైటిల్‌ను లీక్ చేసి..

తాను ఆచార్య సినిమా టైటిల్‌ను బయటకు చెప్పేసేనానే విషయాన్ని గ్రహించిన చిరంజీవి.. సభాముఖంగా కొరటాల శివకు క్షమాపణ చెప్పారు. ఏదో నోటి నుంచి అలా బయటకు వచ్చేసింది అంటూ వివరణ ఇచ్చారు. కొరటాల శివ టైటిల్ ఎనౌన్స్ గురించి మంచి ఈవెంట్‌ను ప్లాన్ చేసుకొన్నాడు. కానీ ఆయన ప్లాన్‌ను చెడగొట్టానంటూ మెగాస్టార్ అన్నారు.

 నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌తో అంటూ

నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌తో అంటూ

ఇక మార్చి 18వ తేదీన విరాట పర్వం మూవీ టీజర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. టీజర్ చూస్తే ఈ సినిమా నక్సల్ బ్యాక్ గ్రౌండ్ అనే విషయం అర్ధమవుతుంది. నా సినిమా ఆచార్య కూడా నక్సలైట్ కథతోనే రూపొందుతున్నది అంటూ చిరంజీవి చెప్పారు.

Recommended Video

Nagarjuna's Wild Dog Interview Part 1 | నాగ్ ఫుల్ హ్యాపీ..!!
రానా మూవీ కథ కూడా నక్సల్ నేపథ్యంగా

రానా మూవీ కథ కూడా నక్సల్ నేపథ్యంగా

నక్సల్ కథతో వచ్చే ఆచార్య సినిమా యూనిక్ ఫిల్మ్ అని భావిస్తున్నాను. ఇలాంటి సినిమా ఈ మధ్య రాలేదని అనుకొన్నాను. కానీ నక్సల్ కథతోనే విరాటపర్వం రావడం కొంత నిరాశ కలిగించింది. కానీ ఈ సినిమా మా సినిమా కంటే ముందు వస్తుంది కాబట్టి విరాటపర్వం హిట్ కావాలని కోరుకొంటున్నాను. మా సినిమాకు ఈ కథ ప్లస్ కావాలని కోరుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు.

మే 14న ఆచార్య రిలీజ్

మే 14న ఆచార్య రిలీజ్

ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నక్సలైట్ కథా నేపథ్యం వచ్చే సీన్లను రాంచరణ్, చిరంజీవిలపై షూట్ చేశారు. ఈ చిత్రం మే 14వ తేదీన రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X