ChiruLeaks: భోళా శంకర్‌లో పవన్ కల్యాణ్.. లీక్ చేసిన చిరంజీవి.. ఇది శాంపిల్ మాత్రమే గురూ!
ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్.. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే రీఎంట్రీలో మరింత జోష్‌తో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న ఆయన.. భారీ విజయాలను సైతం అందుకుంటున్నారు. ఈ ఊపులోనే ఇప్పుడు ఈ సీనియర్ స్టార్ హీరో 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలను మీరే చూడండి మరి!
భోళా శంకర్‌గా చిరంజీవి:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' మూవీని చేస్తోన్నారు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, కీర్తి సురేష్ ఆయన సోదరి పాత్రను చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం ఇస్తున్నాడు. ఇది 'వేదాళం'కు రీమేక్‌గా రూపొందుతోంది.

షూటింగ్ పూర్తి.. ఆ వర్క్:ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇటీవలే ఈ చిత్రం టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలు పెట్టేశారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అవి కూడా పూర్తి చేసి సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.

ప్రమోషన్స్.. చిరు లీక్స్:'భోళా శంకర్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా టీజర్‌తో పాటు రెండు పాటలను విడుదల చేశారు. వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మిగిలినవి కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీటికి తోడు మధ్య మధ్యలో 'చిరు లీక్స్' అంటూ చిరంజీవి ఈ చిత్రానికి సంబంధించిన కీలక విషయాలను కూడా లీక్ చేస్తూనే ఉన్నారు.

మరో లీక్ చేసిన చిరు:తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో చిరంజీవి 'హాయ్ ఫ్రెండ్స్.. భోళా శంకర్ ఫిల్మ్ నుంచి ఓ చిన్న విషయాన్ని మీకు లీక్ చేయబోతున్నా. ఈ విషయం తెలిస్తే మెహర్ రమేష్ గొడవ చేసేస్తాడు. అయినా ఏం పర్లేదు. అసలు సంగతి ఏంటంటే.. మా కల్యాణ్ బాబు తన సినిమాల్లో అప్పుడప్పుడూ నా ప్రస్థావన తీసుకు రావడం, అలాగే నా డ్యాన్సు స్టెప్పులు వేయడం, నా డైలాగులను ఇమిటేట్ చేయడం వంటివి చేసి నన్ను ఎంతగానో ఎంటర్‌టైన్ చేశాడు' అని చెప్పారు.
నేను కూడా చేస్తున్నా:ఆ తర్వాత ఈ వీడియోలో చిరంజీవి కంటిన్యూ చేస్తూ.. 'కల్యాణ్ బాబు చేసినట్లుగానే నేను ఈ సినిమాలో తనను ఇమిటేట్ చేస్తూ.. తన మేనరిజమ్స్, పాటలో యాక్ట్ చేయడం జరిగింది. అవి జస్ట్ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసమే. మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ చూడండి' అంటూ వివరించారు. తర్వాత ఓ చిన్న బిట్‌ను కూడా ప్లే చేసి చూపించారు.

రష్మీతో కలిసి రచ్చ:తాజాగా చిరంజీవి చూపించిన వీడియోలో 'ఖుషి' సినిమాలోని పాటకు చిరంజీవి.. యాంకర్ రష్మీతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ అదరగొట్టేశారు. ఇక, చివర్లో 'చూశారుగా.. ఎంజాయ్ చేసే ఉంటారు. ఇది శాంపిల్ మాత్రమే.. పూర్తి స్థాయిలో రేపు సినిమాలో చూడండి. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు' అని ముగించారు.


Click it and Unblock the Notifications











