రాజమౌళి కథ విన్న చిరు???
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జనవరిలో ప్రారంభం కానున్న రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన పని మొదలయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథను రాజమౌళి నవంబర్ 27న(మంగళవారం) చిరంజీవికి వినిపించినట్టు సమాచారం. రాజమౌళి చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందిట. రాజమౌళిని చిరంజీవి మెచ్చుకున్నారట. కాగా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందనున్న సినిమాలో అమృతారావు హీరోయిన్ గా ఉండవచ్చని భావిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











