Don't Miss!
- News సీఎం జగన్‌పై దాడి ఘటనపై సంచలన కామెంట్స్ చేసిన వంగవీటి రాధా
- Sports KKR vs RR: శతక్కొట్టిన సునీల్ నరైన్.. 19 బౌండరీలతో విధ్వంసం!
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Lifestyle రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
కొరటాలకు షాక్ : చిరు లుక్ లీక్.. నక్సలైట్ పాత్రలో మెగాస్టార్.. పెదవి విరుస్తున్న నెటిజన్లు
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ క్రేజీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఆకాశన్నంటేశాయి. కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంతో సిద్దహస్తుడు, ఇప్పటివరకు అపజయమన్నదే ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ.. మెగాస్టార్‌ను ఎలా చూపిస్తాడా? అన్న మెగాఫ్యాన్స్ కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ మొదలు..
దసరా కానుకగా ఈ మూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.అయితే జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఓ పాట, మూడు ఫైట్లను కంపోజ్ చేసినట్టు చిరు తెలిపాడు. ఇక మరో షెడ్యూల్ కూడా తాజాగా మొదలైందని సమాచారం. అయితే అక్కడే చిత్రయూనిట్‌కు షాక్ తగిలింది.
చిరు లుక్ లీక్..
ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న లొకేషన్ నుంచి చిరు లుక్ లీకైంది. ఈ క్రమంలో ఈ లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు చిరు లుక్ అదిరిపోయిందని అంటుండగా.. మరికొందరు సాదాసీదాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
పెదవి విరుస్తున్న నెటిజన్లు..
తాజాగా లీకైన ఈ లుక్‌పై అప్పుడే ట్రోలింగ్స్ మొదలయ్యాయి. చిరు లుక్, వివి వినాయక్ శీనయ్య లుక్‌ను పక్కన పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా చిరు లుక్‌ను అత్యంత సాధారణంగా డిజైన్ చేశారంటూ నెటిజన్లు కొరటాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నక్సలైట్‌గా చిరు..
కొరటాల మూవీలో చిరంజీవి నక్సలైట్‌గా నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. నిన్న లీకైన ఈ ఫోటోను చూసి ఇలాంటి కథనాలు మరిన్ని పుట్టుకొస్తున్నాయి. మరి అది నిజమో కాదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి.