twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొరటాలకు షాక్ : చిరు లుక్ లీక్.. నక్సలైట్ పాత్రలో మెగాస్టార్.. పెదవి విరుస్తున్న నెటిజన్లు

    |

    మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ క్రేజీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఆకాశన్నంటేశాయి. కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంతో సిద్దహస్తుడు, ఇప్పటివరకు అపజయమన్నదే ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ.. మెగాస్టార్‌ను ఎలా చూపిస్తాడా? అన్న మెగాఫ్యాన్స్ కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తున్నాడు.

     ఇప్పటికే షూటింగ్ మొదలు..

    ఇప్పటికే షూటింగ్ మొదలు..

    దసరా కానుకగా ఈ మూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.అయితే జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఓ పాట, మూడు ఫైట్‌లను కంపోజ్ చేసినట్టు చిరు తెలిపాడు. ఇక మరో షెడ్యూల్ కూడా తాజాగా మొదలైందని సమాచారం. అయితే అక్కడే చిత్రయూనిట్‌కు షాక్ తగిలింది.

    చిరు లుక్ లీక్..

    చిరు లుక్ లీక్..

    ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న లొకేషన్ నుంచి చిరు లుక్ లీకైంది. ఈ క్రమంలో ఈ లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు చిరు లుక్ అదిరిపోయిందని అంటుండగా.. మరికొందరు సాదాసీదాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

    పెదవి విరుస్తున్న నెటిజన్లు..

    పెదవి విరుస్తున్న నెటిజన్లు..

    తాజాగా లీకైన ఈ లుక్‌పై అప్పుడే ట్రోలింగ్స్ మొదలయ్యాయి. చిరు లుక్, వివి వినాయక్ శీనయ్య లుక్‌ను పక్కన పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా చిరు లుక్‌ను అత్యంత సాధారణంగా డిజైన్ చేశారంటూ నెటిజన్లు కొరటాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    నక్సలైట్‌గా చిరు..

    నక్సలైట్‌గా చిరు..

    కొరటాల మూవీలో చిరంజీవి నక్సలైట్‌గా నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. నిన్న లీకైన ఈ ఫోటోను చూసి ఇలాంటి కథనాలు మరిన్ని పుట్టుకొస్తున్నాయి. మరి అది నిజమో కాదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి.

    English summary
    Chiranjeevi Look Leaked From Koratala Movie. And It get Bad Comparison With VV Vinayak Seenayya. This Movie Is Produced Under Konidela Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X