లూసిఫర్ ప్రారంభం.. పూజా కార్యక్రమాల్లో చిరు సందడి.. షూటింగ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ప్రయోగాల జోలికే వెళ్లడం లేదు. మంచి మాస్ మసాలా కమర్షియల్ కథలనే ఎంచుకుంటున్నాడు. అందులోనూ ఓ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకు అలవాటైన పద్దతిలోనూ రీమేక్‌లను ఎంచుకుంటున్నాడు. ఓ భాషలో హిట్ అయినా సినిమాలను రీమేక్ చేస్తూ ముందుకు పోతోన్నాడు. ఇప్పటికే రెండు రీమేక్‌లకు ఓకే చెప్పేశాడు. మళయాలం లూసిఫర్, తమిళ వేదాళం సినిమా రీమేక్‌లకు చిరు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

ఆచార్య పూర్తి..

ఆచార్య పూర్తి..

కొరటాల శివ చిరంజీవి కాంబోలో వస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. చిరుకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్‌కు సంబంధించిన సిద్ద పాత్ర షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

అందుకే ఇలా..

అందుకే ఇలా..

ఆచార్య షూటింగ్ కూడా ముగిసేందుకు వస్తుండటంతో తదుపరి ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేశాడు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ అంటూ అనౌన్స్ చేశాడు. ఆ రీమేక్‌కు దర్శకుడి కోసం బాగానే జల్లెడ పట్టారు. చివరకు ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజాను తీసుకున్నారు.

తమన్ ట్వీట్..

తమన్ ట్వీట్..

ఇక నేటి ఉదయం తమన్ ఓ ట్వీట్ చేశాడు. మ్యూజిక్ పనులు ప్రారంభమయ్యాయి.. బాస్ మీదున్న ప్రేమను చూపించే సమయం వచ్చింది.. నా కల నెరవేరింది అంటూ లూసిఫర్ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి తమన్ చెప్పుకొచ్చాడు.

పూజా కార్యక్రమాలు..

పూజా కార్యక్రమాలు..

తాజాగా లూసిఫర్ రీమేక్ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. నేడు పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మోహన్ రాజా, అల్లు అరవింద్ వంటి తదితరులందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Kajal Aggarwal, Gautam Takes Blessing From Chiranjeevi In Acharya Set
ఫిబ్రవరి నుంచి..

ఫిబ్రవరి నుంచి..

ఇక పూజా కార్యక్రమాల గురించి చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతోన్నట్టు తెలిపారు. ఇతర తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X