For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేశమంతా ఒకే జీఎస్టీ కదా టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. ఏపీ సీఎంకు చిరంజీవి సంచలన ట్వీట్!

  |

  ఏపీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త బిల్లు ప్రకారం ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షోలు మాత్రమే ఉండనున్నాయి. అలాగే టికెట్ రేట్లు కూడా పెంచే అవకాశం ఉండదు. ఈ విషయం గురించి సినిమా ఇండస్ట్రీలో టెన్షన్ నెలకొంది. ఈ విషయం మీద చిరంజీవి ఎట్టకేలకు నోరు విప్పారు. ఆ వివరాల్లోకి వెళితే

  రేట్లు ఇలా

  రేట్లు ఇలా

  ఏప్రిల్‌లో వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టిప్లెక్స్ లలో ప్రీమియం సీట్ల టికెట్ రేట్లు రూ. 250 మాత్రమే ఉండాలి. మిగతా టిక్కెట్లు రూ. 150, 100 ఉండాలి.

  అదే ఏరియాలో సింగిల్ ధియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ. 100 మాత్రమే ఉంచాలి, ఒకవేళ ఏసీ లేకపోతే.. అత్యధిక టికెట్ ధర రూ. 60 మాత్రమే ఉంచాలి. ఈ టికెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. పంచాయతీల్లో జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడి థియేటర్లలో ఈ రేట్లు మరింత తక్కువ.

  చార్జీలు కూడా రావని

  చార్జీలు కూడా రావని

  ప్రభుత‌ జీవో ప్రకారం టిక్కెట్ రేట్లు అమ్మితే ధియేటర్ నిర్వహణ చార్జీలు కూడా రావని చెబుతున్నారు. ఈ విషయంలో రేట్లు పెంచి తీరాల్సిందే అని ప్రభుత్వంతో ఎన్ని సార్లు చర్చలు జరిపినా ప్రయోజనం అయితే ఉండడం లేదు. పలు దఫాలు టాలీవుడ్ నిర్మాతలు, ఒక హీరో నాగార్జున కూడా ఓ సారి వెళ్లి కలిసి వచ్చినా సమస్య మాత్రం క్లియర్ అవ్వలేదు.

  సవరణ బిల్లు ప్రకారం

  సవరణ బిల్లు ప్రకారం

  తాజా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు ప్రకారం ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షోలు మాత్రమే ఉంటాయి. అదనపు షోలకు అవకాశం లేదని బిల్లులో స్పష్టం చేశారు. అలాగే చిన్న సినిమా, పెద్ద సినిమా తేడా లేదని...కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఉంటుందన్నారు. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ఉంటుందని పేర్కొన్నారు.

   కొత్త విధానం

  కొత్త విధానం

  గతంలో పెద్ద హీరో సినిమాలకు 200 నుంచి 500 రూపాయలకు పైగా అమ్మిన పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు ఇలాంటి పద్ధతులు కుదరదని వెల్లడించారు. ఇక మీద ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసేలా మధ్యతరగతి వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చినట్లు ఏపీ మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో వెల్లడించారు.

  హర్షించదగ్గ విషయమే

  హర్షించదగ్గ విషయమే

  అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినీ పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం కోసం హర్షించదగ్గ విషయమన్న ఆయన, అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం టికెట్ల రేట్లు ఉండాలని అన్నారు చిరంజీవి.

  Latest Tollywood Updates : Allu Arjun ఖాతాలో ఓ అరుదైన రికార్డు..! || Filmibeat Telugu

  పునరాలోచించండి

  కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే GST taxes ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం వున్నపుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కు కోగలుగుతుంది అంటూ జగన్‌ కు అప్పీల్ అని చెబుతూ ఆయనని ట్యాగ్ చేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.

  Read more about: megastar chiranjeevi ys jagan
  English summary
  Chiranjeevi made a Request To CM YS Jagan on Andhra Pradesh ticketing
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X