twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Andhra Pradesh‌లో ప్రజా జీవితం అస్తవ్యస్తం.. చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్, రాంచరణ్ భారీ విరాళాలు

    |

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తుఫాన్ పరిస్థితులు అతలాకుతలం చేశాయి. వరదలు పలు ప్రాంతాలు పోటెత్తడంతో జన జీవనం స్తంభించింది. భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. దీంతో పలు జిల్లాలో ప్రజలు రోడ్డున పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ మరోసారి స్పందించింది. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకొనేందుకు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించారు. భారీ సహాయం అందించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఉన్నారు.

     Chiranjeevi, Mahesh Babu, Ram Charan

    వరద బాధితులను ఆదుకొనేందుకు చిరంజీవి రూ.25 లక్షలు ప్రకటించగా, రామ్ చరణ్ కూడా 25 లక్షలు సహాయం ప్రకటించారు. మెగా కుటుంబం నుంచి రూ.50 లక్షలు ప్రకటించడం గమనార్హం. అలాగే, ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా చెరో రూ.25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు వీరు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు.

    ఆంధ్రప్రదేశ్‌లో భారీ తుఫాన్, వరదలు పోటేత్తడంతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. అలాంటి పరిస్థితి చూసి బాధలో మునిగిపోయాను. సహాయ చర్యల కోసం నా వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు.

    వరద ముంపుతో బాధపడుతున్న ఏపీ ప్రజల పరిస్థితి చూసి నా గుండె భారంగా మారింది. నా వంతు బాధ్యతగా సహాయక చర్యల కోసం ఏపీ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను అని రాంచరణ్ ట్విట్టర్‌లో సందేశాన్ని పెట్టారు.

    ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ తాకిడిగి ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. దాంతో సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల సహాయం అందిస్తున్నాను. కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకొనేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి.. ఈ సంక్షోభాన్ని నివారించమని కోరుతున్నాను అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    తుఫాన్ తాకిడితో తల్లడిల్లుతున్న ప్రజలకు సహాయక చర్యలు ప్రారంభించడానికి నా వంతుగా 25 లక్షలు రూపాయల సహాయం అందిస్తున్నాను. ఈ చిన్న సహాయం ప్రజలకు ఊరట ఇస్తుందని భావిస్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

    English summary
    Tollywood heroes Chiranjeevi, Mahesh Babu, Ram Charan, Jr NTR announces 25 lakhs each for AP cyclone relief
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X