»   »  చిరంజీవితో ఒరిగేదేమీ లేదు: మందకృష్ణ మాదిగ

చిరంజీవితో ఒరిగేదేమీ లేదు: మందకృష్ణ మాదిగ

Posted By:
Subscribe to Filmibeat Telugu
చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఔత్సాహిక రాజకీయ నాయకులు ఎత్తుగడలు వేస్తుంటే ఎంఆర్పీయస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నాడు. చిరంజీవి రాజకీయాలలోకి వస్తే ఒరిగేదేమీ ఉండదని అంటున్నాడు. చిరంజీవికి మద్ధతిచ్చే ప్రశ్నే లేదని స్పష్టం చేస్తున్నాడు. చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితులలో మద్ధతిచ్చేది లెదంటున్నాడు. చిరంజీవి లాంటివారు నిజంగా ప్రజా సేవే చేయాలనుకుంటే రాజకీయాలలోకి రాకుండా చేయవచ్చని మందకృష్ణ మాదిగా అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X