పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం వెనుక చిరంజీవి.. పవర్‌స్టార్‌కు కోసం మెగాస్టార్ మాస్టర్ ప్లాన్!

జనసేన పార్టీ పటిష్టత కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు రెండేళ్లకుపైగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన అర్థిక అవసరాల కోసం ఏడాదిన్నర క్రితం తెలుగు సినిమాల్లో నటించడానికి ముందుకొచ్చారు. అయితే టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్‌ ప్రారంభించాలని భావించిన పవన్ కల్యాణ్ నిర్ణయం వెనుక మెగాస్టార్ మాస్టర్ ప్లాన్ ఉందని జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తాజాగా సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ఆ వివరాల్లోకి వెళితే..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత

అసెంబ్లీ ఎన్నికల తర్వాత

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడానికి కీలక నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు గతంలో కమిట్ అయిన చిత్రాల్లో నటించడానికి ముందుకొచ్చారు. అంతేకాకుండా కొత్తగా రెండు, మూడు సినిమాలను అంగీకరించారు. ప్రస్తుతం వకీల్ సాబ్ విడుదలకు సిద్దంగా ఉండగా.. రెండు చిత్రాలు షూటింగు దశలో ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి సలహాతోనే

మెగాస్టార్ చిరంజీవి సలహాతోనే

అయితే పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి రావడం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. చిరంజీవి ఇచ్చిన సలహా మేరకే పవన్ టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పవన్‌‌ను మళ్లీ సినిమాలు చేయడానికి ఒప్పించింది చిరంజీవి అంటూ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో సీక్రెట్ బయటపెట్టారు.

మనోహర్ నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

మనోహర్ నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి కీలక పాత్ర పోషించనున్నట్టు నాదెండ్ల మనోహార్ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. పవన్ ప్రస్థానంలో తాను ఉంటానని చిరంజీవి స్వయంగా వెళ్లడించారని ఆయన పేర్కొన్నారు.

Recommended Video

30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
పవన్ సెకండ్ ఇన్నింగ్స్ జోరు ఇలా

పవన్ సెకండ్ ఇన్నింగ్స్ జోరు ఇలా

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ చిత్రం విడుదల లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం దర్శకుడు రూపొందించే క్రిష్ చిత్రంలోనూ, అలాగై మైత్రి మూవీస్ చిత్రంలో, అలాగే ఏఎం రత్నం నిర్మించే చిత్రంతోపాటు మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనమ్ కోషియం చిత్రంలో నటిస్తున్నారు. పవన్, రానా కలిసి నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X