»   » శ్రీజ పెళ్లి తర్వాత ఆసుపత్రిలో చేరనున్న చిరంజీవి!

శ్రీజ పెళ్లి తర్వాత ఆసుపత్రిలో చేరనున్న చిరంజీవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నెల రోజుల క్రితం తన కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ అనంతరం ఆయన కొన్ని రోజుల పాటు చేతికి కట్టుతోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీజ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా ఆయన కట్టుతోనే కనిపించారు.

Also Read: శ్రీజ బ్రైడ్ మేకింగ్: బన్నీ-స్నేహ దంపతులే హోస్ట్ చేసారు (ఫోటోస్)

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి మరోసారి ఆసుపత్రిలో చేరుతారని సమాచారం. ఈ సారి ఆయన ఎడమ భుజానికి సర్జరీ చేయించుకుంటారని సమాచారం. వచ్చే వారం చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం జరుగబోతోంది. వివాహం అనంతరం ఆయన ఎడమ భుజానికి అర్జరీ చేయించుకునేందుకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరబోతున్నారు.

Also Read: 'సర్దార్' నిర్మాత శరత్ మరార్ గురించి ఆసక్తికర విషయాలు

Chiranjeevi May Undergo Another Surgery, Post Srija's Wedding

ఆయన తన సినిమా కెరీర్ మొత్తం అలుపు లేకుండా శ్రమించారు. ఆ ప్రభావమే ఆయన భుజాలపై పడింది. దాదాపుగా రెండేళ్ల నుండి చిరంజీవి బుజం నొప్పితో బాధ పడుతున్నారు. చిరంజీవి పరీక్షించిన వైద్యులు ఆపరేషనే చక్కటి పరిష్కారం అని సూచించారు. వైద్యుల సూచన మేరకు చిరంజీవి ఇప్పటికే కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు.

శ్రీజ వివాహం అనంతరం చిరంజీవి తన ఎడమ భుజానికి ఆపరేషన్ చేయించుకోబోతున్నారు. ఆపరేషన్ పూర్తయితే..... చిరంజీవి తన 150వ సినిమాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పాల్గొంటారు. చిరంజీవి 150 కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఆయన డాన్సులు, ఫైట్స్ తో అదరగొట్టాలంటే ఆపరేషన్ తప్పనిసరి.

English summary
Megastar Chiranjeevi, who underwent a surgery on his right shoulder last month, is expected to be operated on his left shoulder next month, a source close to the star said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu