గవర్నర్‌ను కలిసి చిరు దంపతులు.. కారణం అదే
మెగాస్టార్ చిరంజీవి సినీ రాజకీయ అంశాలను సమానపాళ్లతో చూసుకుంటూ వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటూ.. సినీ పరిశ్రమ అభివృద్దికి పాటు పడుతున్నారు. ఈ మధ్య కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను వివరించి తిరిగి షూటింగ్‌లు ప్రారంభించే విధంగా చేశారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఇంతకు ముందు కూడా ఓ సారి కలిశారు.
సైరా చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించాలన్న చిరు కోరిక మేరకు తమిళసై చూశారు. సైరాపై తమిళిపై ప్రశంసలు కురిపిస్తూ.. 'గత ఇరవై ఏళ్లలో నేను చూసింది రెండు సినిమాలే... అవి కాలా, సైరా. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో దక్షిణ భారతదేశ పాత్ర ఎలాంటిదో సైరా నిరూపించింది. తన వెంటే నమ్మిన బంటులా ఉండే రాజా పాండీ క్యారెక్టర్‌తో తెలుగు, తమిళుల మధ్య ఉన్న సోదర భావం ఎలాంటిదో మరోసారి చూపించారు. ప్రతీ ఒక్క భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమిది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా బయటకు తీసుకొచ్చేందుకు చిరంజీవి పడిన కష్టాన్ని తప్పక అభినందించాలి' అంటూ ట్వీట్ చేసింది.

తాజాగా మరోసారి చిరంజీవి దంపతులు గవర్నర్‌ను కలిశారు. చిరంజీవి తన సతీమణి సురేఖతో పాటుగా రాజ్ భవన్‌కు వెళ్లి తమిళిసైను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళిసైని కలిసిన అనంతరం సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో మీరు మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











