'సైరా' సంబరాల్లో మెగా మీట్.. చిరంజీవి రిక్వెస్ట్.. సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సైరా సంబరాలు మిన్నంటుతున్నాయి. ఈ దసరా పండగకు కొత్త శోభ తీసుకొచ్చింది సైరా నరసింహా రెడ్డి మూవీ. దేశవిదేశాల్లోని మెగా ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. సరిగ్గా ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ గవర్నర్‌తో చిరంజీవి భేటీ ఎందుకోసం? అసలు విషయం ఏంటి? వివరాల్లోకి పోతే..

'సైరా' సంబరాల్లో మెగా మీట్
తమిళసై సౌందరరాజన్ తెలంగాణకు గవర్నర్‌గా నియమితులైన తర్వాత చిరంజీవి ఆమెను కలిసి శాలువాతో సత్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్‌కు దసరా శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్ ఆమెతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సమావేశంలో తన తాజా సినిమా సైరా నరసింహా రెడ్డి విశేషాలు ఆమెతో పంచుకున్నారు చిరంజీవి.

చిరంజీవి రిక్వెస్ట్
సైరా సినిమా ప్రత్యేకతలను గవర్నర్‌కి వినిపించిన చిరు.. బ్రిటిష్ సైన్యంపై తొలి తిరుగుబాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రను వెండితెరపై చూడమని ఆమెను రిక్వెస్ట్ చేశారు. చిరు చేసిన ఈ అభ్యర్థనపై గవర్నర్ సానుకూలంగా స్పందించి వెంటనే సైరా చూస్తానని తెలిపినట్లు సమాచారం. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చలు నడిచినట్లుగా తెలుస్తోంది.

చెన్నై సంగతులు.. చిరంజీవికి సాదర స్వాగతం
తనతో మాట్లాడటానికి వచ్చిన చిరంజీవికి సాదర స్వాగతం పలికిన గవర్నర్.. ఆయనతో ఆప్యాయంగా ముచ్చటించిందని సమాచారం. చిరంజీవి సినీ లైఫ్ గురించి కాసేపు ఆమె మాట్లాడినట్లుగా సమాచారం. అదే విధంగా తాను చెన్నైలో ఉన్న సమయంలో నాటి విషయాలను.. తమిళనాడుతో తనకు ఉన్న సంబంధాలను చిరంజీవి ఆమెకు వివరించారని తెలిసింది.

సైరా కలెక్షన్ల సునామీ
మరోవైపు సైరా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆ సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విడుదలైన 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటేసిన సైరా నరసింహా రెడ్డి ఈ దసరా సెలవులు ముగిసే సరికి సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.


Click it and Unblock the Notifications











