మోహన్ బాబు కూతురుతో చిరు
మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న,చిరంజీవి రీసెంట్ గా హీరోయిన్ శ్రీదేవి మ్యారేజ్ రిసప్షన్ లో కలవటం జరిగింది. ఆ సందర్బంగా చిరంజీవి ఆమెను లక్ష్మీ టాక్ షో గురించి అడిగి మెచ్చుకున్నారు. దాంతో లక్ష్మీ ప్రసన్న ఆయన అబ్జర్ వేషన్ కి ఆశ్చర్యపడిందని సమాచారం. అలాగే ఆమె ఎమ్మల్యే చిరంజీవిని కంగ్రాట్స్ అని చెప్పిందని అంటున్నారు. ఇక అంతకు ముందే మోహన్ బాబు, చిరంజీవి ఒకరుకొకరు ఎదురుపడ్డారు. చిరునవ్వుతో పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ దృశ్యం చూసిన వారు మొదట అబ్బురపడ్డా వారి సంస్కారానికి సంతోషపడ్డారు. ఎందుకంటే ఇద్దరూ ఒకేసారి కెరీర్ ప్రారంభించి ఎదిగారు. అనంతరం వచ్చిన గొడవలుతో మోహన్ బాబు అప్పుడప్పుడూ చిరుకు చురకలు అంటిస్తూనే ఉన్నారు. అయితే ఈ వివాహంకి అనేక తెలుగు,తమిళ సినిమా నటులు వచ్చి ఇలా ఒకరుకొకరు తారసపడి పలకరించుకున్నారు.
More from Filmibeat
laxmi prasanna chiranjeevi megastar mohanbabu laxmi talk show sridevi manjula మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న శ్రీదేవి మ్యారేజ్ రిసప్షన్ చిరంజీవి


Click it and Unblock the Notifications











