మంత్రితో సినీ పెద్దల భేటీ.. షూటింగ్‌లు, థియేటర్స్ ప్రారంభంపై చర్చ.. చొరవ తీసుకోవాలన్న మెగాస్టార్

ఓ వైపు కేంద్రం లాక్ డౌన్ నాల్గో దశ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికే పలు రంగాలకు లెక్కలేనన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం దేశమంతా పాక్షికంగానే లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను, గట్టెక్కించే మార్గాలను చర్చించేందుకు సినీ పెద్దలందరూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నాగార్జున, త్రివిక్రమ్, కొరటాల శివ, అల్లు అరవింద్, దిల్ రాజు, చినబాబు వంటి వారంతా పాల్గొన్నారు.

Recommended Video

Chiranjeevi And Other Tollywood Big Shots Meeting With Talasani Srinivas Yadav
మూడు నాలుగు నెలలు..

మూడు నాలుగు నెలలు..

అంతకుముందు తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. మరో మూడు నాలుగు నెలలు థియేటర్స్ ఓపెన్ చేయడం, షూటింగ్‌లు ప్రారంభించడం కష్టమేనన్నట్టు సంకేతాలు అందించారు. ముఖ్యమంత్రితో జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించారు.

తాజాగా భేటీలో..

తాజాగా భేటీలో..

ఆంధ్ర ప్రదేశ్‌లో షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ఇక్కడా ఒత్తిడి తేవాలని సినీ పెద్దలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సినీ పెద్దలంతా నేటి ఉదయం చిరంజీవి కార్యాలయంలో భేటీ అయ్యారు. తలసాని నేతృత్వంలో అంతా కలిసి చర్చించారు.

ప్రభుత్వ నిబంధనలకు లోబడే..

ప్రభుత్వ నిబంధనలకు లోబడే..

చిరంజీవి మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఎంతో మంది ఉపాధి కోల్పోయారని అన్నారు. రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే షూటింగ్స్ నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. మామూలుగా అయితే షూటింగ్స్ జరపడానికి ఎవ్వరి అనుమతి అక్కర్లేదని కానీ ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే షూటింగ్‌లు, థియేటర్స్ ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

త్వరలోనే నిర్ణయం..

త్వరలోనే నిర్ణయం..

ప్రస్తుతం ఏర్పడిన ఈ పరిస్థితి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మన తెలుగు పరిశ్రమే అతి పెద్దదని, దీనిపై ఎంతో మంది ఆదారపడి ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X