చిరు, మోహన్ బాబు..‘టామ్ అండ్ జెర్రీ’!
తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకొదగ్గ పెద్ద స్టార్లలో చిరంజీవి, మోహన్ బాబు ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ ఇద్దరి వ్యవహారం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి బహిరంగంగా విమర్శించుకుంటారు. ఒక్కోసారి కలిసిమెలిసి ఆప్యాయంగా మంచి స్నేహితుల్లా ఉంటారు. మరోసారి ఒకరిపై ఒకరు సెటైర్లు విసురుకుంటూ వీరికి అస్సలు పడదేమో? అనే భావన కల్పిస్తారు.
ఇదే అనేమానం వచ్చిన మీడియా ప్రతినిధులు ఒక ఇంటర్వ్యూలో చిరంజీవిని ప్రశ్నించారు. మీరు స్నేహితులా? ప్రత్యర్థులా...మీ బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరికీ అర్థం కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఒకసారి, మరోసారి అందుకు భిన్నంగా ఉంటారు అనే రీతిలో ఒక ప్రశ్న సంధించారు.
దీనికి చాలా విచిత్రమైన సమాధానం ఇచ్చారు చిరంజీవి. మేము 'టామ్ అండ్ జెర్రీ' లాంటి వాళ్లం...మా బంధంలో కలహాలు, ఆప్యాయతలు మామూలే. చాలా దగ్గరి స్నేహితుల మధ్య మాత్రమే 'టామ్ అండ్ జెర్రీ' లాంటి ప్రవర్తన కనిపిస్తుందని చమత్కరించారు.
ప్రస్తుతం చిరంజీవి సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లో ప్రశేశించారు. మోహన్ బాబు రాజకీయాల నుంచి బయటకు వచ్చి తన సినిమా నిర్మాణ సంస్థ, ఇతర వ్యాపాల్లో బిజీగా ఉన్నారు. ఒక వేళ ఇద్దరూ ఒకే రంగంలో ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ....ప్రస్తుతం ఇద్దరు వేర్వేరు రంగాల్లో ఉండటం వల్లనే ఇద్దరి మధ్య పోటాపోటీ తత్వం తగ్గిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
సినిమా జీవితానికి ఇప్పటికే గుడ్ బై చెప్పిన చిరు...త్వరలో చివరగా 150వ చిత్రాన్ని చేయబోతున్నారు. చిరంజీవి రాజకీయ భవిష్యత్‌కు ప్లస్సయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈచిత్రాన్ని స్వయంగా చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 'నాయకుడే సేవకుడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు రావణాసురుడి పాత్రలో 'రావణ' అనే చిత్రానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారీ పౌరాణిక చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థపై ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











