చిరంజీవి హీరో, మా నాన్న విలన్ (మంచు విష్ణు డ్రీమ్)
హైదరాబాద్: మంచు విష్ణు కథానాయకుడిగా... జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో డా.మోహన్ బాబు నిర్మాతగా 'దేనికైనా రెడీ' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం అక్టోబర్ 24న విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరో మంచు విష్ణు మాట్లాడుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ...... 'చిరంజీవి అంకుల్, మా నాన్నలతో మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉంది. అందులో మా నాన్న మోహన్ బాబుగారు విలన్ పాత్ర లాంటి నెగెటివ్ రోల్ చేస్తే బాగుంటుంది. నా డ్రీమ్ ప్రాజెక్టును కార్యరూపం దాల్చడానికి ట్రై చేస్తా' అని సమాధానం ఇచ్చారు.
ఇక ఈ చిత్రం వివరాల్లోకి వెళితే... మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందో ఊహించుకోవచ్చు. అందాలతార హన్సిక ఇందులో కథానాయిక.
ఈచిత్రం గురించి విడుదలపై మంచు విష్ణు మాట్లాడుతూ... సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని, దసరా పండగ సందర్భంగా ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమా అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్ బాబు.


Click it and Unblock the Notifications











