twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎప్పటికైనా చిరంజీవే కింగ్.. మళ్ళీ ప్రూవ్ అయింది.. బాలయ్యని వెనక్కు నెట్టిన నాని!

    |

    తెలుగు వెండి తెరపై ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి రారాజే. 8 ఏళ్ల గ్యాప్ తరువాత వచ్చిన చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంతో రికార్డులు తిరగరాశారు. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అభిమానుల్లో మెగాస్టార్ కు ఉండే క్రేజ్ ఏంటో మరోమారు రుజువైంది. ఇయర్ ఎండింగ్ కావడంతో ఈ ఏడాది నమోదైన రికార్డులన్నీ పరిశీలనలోకి వస్తున్నాయి. ఈ ఏడాది సౌత్ ఇండియాలో సినీ స్టార్స్ కేటగిరిలో ఎక్కువమంది గూగుల్ లో వెతికిన స్టార్ గా చిరంజీవి నిలిచారు.

    మెగాస్టార్ సత్తా

    మెగాస్టార్ సత్తా

    ఈ ఏడాది మెగాస్టార్ నుంచి ఒక్క చిత్రం కూడా రాలేదు. అయినా కూడా గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఎక్కువ మంది వెతికిన సెలేబ్రిటిగా చిరు సౌత్ ఇండియాలో అగ్ర స్థానంలో నిలిచారు. చిరంజీవి నటించే చిత్రాల కోసం అభిమానుల్లో ఇప్పటికీ అదే ఉత్సాహం నెలకొని ఉంది. చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 చిత్రం 2017 లో విడుదలైంది. ఆ చిత్రం తరువాత చిరు నటిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి.

     చిరు తర్వాత నాని

    చిరు తర్వాత నాని

    మెగాస్టార్ చిరంజీవి తరువాత సౌత్ లో అత్యధికంగా గూగుల్ లో సెర్చ్ చేయబడ్డ తెలుగు స్టార్ నాని కావడం విశేషం. నందమూరి బాలకృష్ణని వెనక్కి నెట్టి మరీ నాని ఈ స్థానం దక్కించుకున్నాడు. నాని, బాలయ్య తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన, యాంకర్ అనసూయ, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, జగపతి బాబు నిలిచారు .

    నెం.1 పొజిషన్లో ప్రియా వారియర్, సన్నీ లియోన్‌ ఔట్ (2018 టాప్ 10 రిపోర్ట్)

    అగ్రస్థానంలో గీత గోవిందం

    అగ్రస్థానంలో గీత గోవిందం

    ఇక గూగుల్ లో ఈ ఏడాది టాప్ ట్రెండ్ లో నిలిచిన సౌత్ చిత్రాల జాబితాలో గీత గోవిందం అగ్రస్థానంలో నిలిచింది. గీత గోవిందం తర్వాతి స్థానంలో విజయ్ సర్కార్, రాంచరణ్ రంగస్థలం, మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రాలు నిలిచాయి. రజనీకాంత్ కాలా, 2.౦ చిత్రాలు 5, 6స్థానాలని ఆక్రమించగా మహానటి చిత్రం 7 వ స్తానం దక్కించుకుంది. తీవ్రంగా నిరాశపరిచిన నని కృష్ణార్జున యుద్ధం చిత్రం 8 వ స్థానంలో నిలవడం విశేషం. విశ్వరూపం 2, ఒరు అదార్ లవ్ చిత్రాలు 9, 10 స్థానాలు దక్కించుకున్నాయి.

    ట్రెండింగ్‌లో నిలిచిన పాటలు

    ట్రెండింగ్‌లో నిలిచిన పాటలు

    2018లో ట్రెండింగ్ లో నిలిచిన సౌత్ సాంగ్స్ జాబితాలో తెలుగు పాటలే టాప్ 5లో నిలిచాయి. నాని, నాగార్జున మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ లోని వారు వీరు అనే సాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. టాక్సీవాలా చిత్రంలోని మాటే వినదుగా సాంగ్ 2వ స్థానంలో, హలో గురు ప్రేమకోసమే చిత్రంలోని మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్ సాంగ్ 3 వ స్థానంలో నిలిచింది. గీత గోవిందం చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలె, సవ్యసాచి లోని నిన్ను రోడ్డు మీద చూసినట్లు పాటలు 4,5 స్థానాల్లో నిలిచాయి.

    English summary
    Chiranjeevi most Googled south star in 2018.Most Trending movie is Geetha Govindam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X