సీనియర్ హీరోయిన్ తో జట్టుకట్టనున్న మెగాస్టార్.. అనూహ్యంగా రివీల్!

సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో రాధిక టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రాధిక కాంబోకి అయితే ఇక తిరుగు లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ కాంబో మరో మారు రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాధిక హింట్ ఇచ్చారు. రాధిక, చిరంజీవి కాంబినేషన్ ఒకప్పుడు టాలీవుడ్ లో హాట్ ఫేవరేట్. వీరిద్దరూ కలిసి చేసిన అభిలాష, దొంగ మొగుడు, యమకింకరుడు, రాజా విక్రమార్క, హీరో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక తాజాగా రాధిక ఒక క్రేజీ న్యూస్ ప్రకటించారు. త్వరలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా శరత్ కుమార్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. శరత్ కుమార్ రాధాన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది.

'శరత్ కుమార్ రాధాన్ బ్యానర్ లో సినిమా చేసేందుకు అంగీకరించిన ప్రియమైన చిరంజీవి ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమా ఉండబోతోంది. కింగ్ ఆఫ్ మాస్ తో బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నాం' అంటూ రాధికా ట్విటర్ లో ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు.. నటీనటులు అనే వివరాలు ఏవీ తెలియలేదు. వీలైనంత త్వరలో తెలిసే అవకాశం కనిపిస్తోంది. రాధిక భర్త శరత్ కుమార్ కూడా సీనియర్ నటుడు. శరత్ కుమార్ చిరంజీవితో కలిసి గ్యాంగ్ లీడర్, స్టువర్టుపురం చిత్రాల్లో నటించారు. అలా చిరంజీవి శరత్ కుమార్ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది.

Radhika Sarathkumar confirms project with Chiranjeevi in her production.

చిరంజీవి నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే చిరంజీవి నాలుగు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. 'ఆచార్య' రిలీజ్‌ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకోగా ఇప్పుడు ఆయన మోహన్‌ రాజాతో 'లూసిఫర్‌' రీమేక్‌ గాడ్ ఫాదర్.. మెహర్‌ రమేశ్‌తో 'వేదాళం' రీమేక్‌ భోళా శంకర్, బాబీతో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నారు. ఇక ఇవి కాక డీవీవీ దానయ్య నిర్మాణంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌ చేయడానికి సిద్దమయ్యారు. నిజానికి చిరంజీవికి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో థమ్స్ అప్, నవరత్న ఆయిల్ వంటి బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే చివరిగా 13 ఏళ్ల క్రితం మెగాస్టార్‌ క‌మ‌ర్షియ‌ల్‌ యాడ్‌లో కనిపించారు. మళ్ళీ ఆయన ఇటీవల ఉగాదికి మళ్ళీ శుభగృహ యాడ్ లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X