ఆ రెండు బ్లాక్ బస్టర్ కు సీక్వెల్స్.. మరి అతిలోక సుందరి ఎవరో?

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమా కెరియర్ లో బాస్టర్ హిట్ నిలిచిన ఇంద్ర మూవీ రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ రీ రిలీజ్ రికార్డులను బ్రేక్ చేస్తూ.. భారీ కలెక్షన్స్ లను వసూళ్లు చేసింది. చిరు బర్త్ డే కానుకగా మెగా ఫ్యాన్స్ కూడా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఇంద్ర మూవీ టీం.ఈ మూవీ రీ రిలీజ్ గాండ్ర్ సక్సెస్ కావడంతో చిరు ఆ మూవీ టీమ్ మొత్తాన్ని తన ఇంటికి పిలిపించి అభినందించారు. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు బి.గోపాల్, నిర్మాత అశ్విని దత్, పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇతర టీమ్ పాల్గొన్నారు.

ఈ సమయంలో పలు ఆసక్తికర ఆంశాలు చర్చకు వచ్చాయంట. అందులో ఓ అంశం మాత్రం హైలెట్ గా నిలిచింది. ఆ టాఫిక్ మెగా స్ఠార్ అభిమానులకు పుల్ జోష్ నిచ్చింది. హాట్ టాపిక్ గా నిలిచిన విషయమేమింటంటే.. చిరు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్రకు సీక్వెల్స్ రాబోతున్నాయనీ, వాటికి సంబంధించిన వివరాలు త్వరలో చెబుతానని నిర్మాత అశ్వినిదత్ ప్రకటించారు. దీంతో ఈ టాపిక్ వైరల్ గా కావడంతో మెగా ఫ్యాన్స్ లో సందడి మొదలైంది.

chiranjeevi movies Indra Jagadeka Veerudu Atiloka Sundari Sequels Confirmed

నిజంగా మెగాస్టార్ సినీ ప్రస్థానంలో ఇంద్ర, జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీస్ ఎవర్ గ్రీన్. ఈ రెండు భారీ బడ్జెట్ మూవీస్ ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. అయితే.. ఈ హిట్ సినిమాలకు సీక్వెల్ తీయాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో చిరు ఫ్యాన్స్ బిగ్ సర్పైజ్ ఇవ్వాలని భావించిన నిర్మాత అశ్వినీదత్ .. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర సినిమాల సీక్వెన్స్ తీసుకరావడానికి తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని ప్రకటించారు. సీక్వెల్స్ కోసం చిరు అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని, వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేమని అన్నారు.

అయితే.. సీక్వెల్స్ ప్రకటన నేపథ్యంలో కొన్ని విషయాలను ప్రాక్టికల్ గా పరిశీలించాలి. ముందు జగదేకవీరుడు అతిలోకసుందరి విషయానికి వస్తే.. ఈ మూవీ 1990లో విడుదలై.. ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిలిచింది. చిరు కెరీర్ లోనే కాదు. శ్రీ దేవీ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రియల్లీ అతిలోక సుందరి పాత్రలో శ్రీ దేవి ఒదిగిన రీతు అద్బుతం. ఆమె నిజంగా దేవ కన్య లాగా కనిపించింది. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడిన.. ఎంత చెప్పినా తక్కువేనని చెప్పాలి.

ఇటీవల సీక్వెల్స్ ట్రెండ్ షురు అయ్యింది. ఈ ట్రెండ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ మూవీకి సీక్వెల్ రావాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ ప్రారంభించారు. అయితే.. ఈ సీక్వెల్స్ లో చిరు కాకుండా.. రామ్ చరణ్, జాన్వీ కపూర్ లు జంటగా నటిస్తే.. బాగుంటుందని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే.. నిర్మాత ఆశ్విని దత్ ఏం ఫ్లాన్ చేస్తున్నారో.. మూవీ మేకర్స్ కథను ఎలా డిజైన్ చేయబోతున్నారో... ఒకవేళ చిరంజీవి నటిస్తే.. ఈ మూవీలో అతి లోక సుందరి పాత్రలో ఎవరు నటించబోతున్నారో ? అనేది హాట్ టాపిక్ మారాయి. ఇకపోతే., జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వి కపూర్ నటించాలని ఇదివరకు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన సంగతి తెలిసిందే.

chiranjeevi movies Indra Jagadeka Veerudu Atiloka Sundari Sequels Confirmed

ఇక ఇంద్ర సినిమా విషయానికి వస్తే.. 2002లో విడుదలైన ఈ మూవీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా కోసం చాలా కసరత్తు చేశారంట. ఇతర నటులు, టెక్నిషన్ కూడా ఎంతో కష్టం పడ్డారు. దీంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ తీయాలనే ప్లాన్ బాగున్నా.. ఈ మధ్య కాలంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాలు రావడం లేదు. అప్పడప్పుడు అలాంటి సినిమాలు వచ్చినా.. ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతున్నాయి. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకోని సోర్టీని ఎలా మార్చుకుంటారో.. దర్శక, నిర్మాత మూవీని ఎలా తెరకెక్కిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X