twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియా అధినేతతో చిరంజీవి ఫోన్ కాల్ లీక్: పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ మెగాస్టార్ ఆవేదన

    |

    దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కథా నాయకుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదే సమయంలో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను ఏర్పాటు చేసి ప్రజాసేవలోనూ ముందుంటున్నారు. ఇక, ఇప్పుడు కరోనా సమయంలోనూ ఎంతో మందికి సేవ చేసేందుకు ముందుకొచ్చిన ఆయన.. ఆక్సీజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఓ మీడియా అధినేతతో మాట్లాడిన ఫోన్ కాల్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

    పైట లేకుండా కుర్రాళ్లను కట్టిపడేస్తున్న నికిత స్వామి.. హాట్ స్టిల్స్

     రీఎంట్రీలో దూకుడు.. వరుస సినిమాలు

    రీఎంట్రీలో దూకుడు.. వరుస సినిమాలు

    సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్రస్తుతం 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే 'లూసీఫర్' రీమేక్, 'వేదాళం' రీమేక్‌తో పాటు బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకున్నారు.

    లాక్‌డౌన్‌లో సినీ కార్మికులకు అండగానే

    లాక్‌డౌన్‌లో సినీ కార్మికులకు అండగానే

    సేవా కార్యక్రమాలు చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను నిలిపారాయన. ఈ క్రమంలోనే గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికుల కోసం 'సీసీసీ'ని ఏర్పాటు చేశారు. దీనికోసం ఎంతో మంది నుంచి విరాళాలు సేకరించి.. చాలా మందికి సహాయం చేస్తున్నారు.

     చిరంజీవిపై విమర్శలు... బాధలో ఫ్యాన్స్

    చిరంజీవిపై విమర్శలు... బాధలో ఫ్యాన్స్

    సెకెండ్ వేవ్‌లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపుతోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు సైతం ఈ మహమ్మారి ప్రభావంతో గజగజ వణికిపోతున్నాయి. దీంతో పలువురు సెలెబ్రిటీలు తమ వంతుగా సహాయాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది చిరంజీవిని విమర్శించారు. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా బాధ పడిపోయారు.

     ఆక్సీజన్ బ్యాంకులతో ముందుకొచ్చారు

    ఆక్సీజన్ బ్యాంకులతో ముందుకొచ్చారు

    కరోనా సమయంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో.. మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్‌లను ప్రారంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో వీటిని ఏర్పాటు కూడా చేశారు. దీనికి సంబంధించిన పనులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. దీంతో విమర్శించిన వాళ్లే ప్రశంసిస్తున్నారు.

    మెగాస్టార్ చిరంజీవిపై ఆ పత్రికలో కథనం

    మెగాస్టార్ చిరంజీవిపై ఆ పత్రికలో కథనం

    మెగాస్టార్ చిరంజీవి ఆక్సీజన్ బ్యాంకులను ఏర్పాటు చేయడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ప్రముఖ పత్రికలో ప్రత్యేకమైన కథనం ప్రచురితం అయింది. ఆయన చేస్తున్న మంచి పని గురించి ప్రశంసిస్తూనే.. దీనిపై అభిమానుల మనసులోని భావనను కూడా ప్రస్తావించారు. దీంతో చాలా మంది చిరంజీవిని అభినందిస్తున్నారు.

    మీడియా అధినేతతో చిరంజీవి ఫోన్ లీక్

    మీడియా అధినేతతో చిరంజీవి ఫోన్ లీక్

    తనపై ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించిన పత్రిక అధినేత ముత్తా గోపాలకృష్ణతో మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికరమై చర్చ జరిగింది. ఈ కాల్‌లో సీనియర్ జర్నలిస్టు చిరంజీవిని అభినందించారు. ఫ్యాన్స్ పడుతోన్న ఆవేదనను అర్థం చేసుకుని ఈ ఆర్టికల్ రాసినట్లు చిరంజీవికి తెలిపారు. అలాగే, రాజకీయాలకు ముడిపెడుతూ మాట్లాడారు.

    Recommended Video

    Sr NTR పై Fanism చాటుకున్న Megastar, 100వ జయంతికి రావాల్సిందే!! || Filmibeat Telugu
    చిరంజీవి ఆవేదన.. కరెక్టుగా రాశారంటూ

    చిరంజీవి ఆవేదన.. కరెక్టుగా రాశారంటూ

    ఈ ఫోన్ కాల్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. 'మీరు చాలా చక్కగా రాశారు. నాకు గతంలో ఎన్నో ప్రశంసలు వచ్చినా.. కరెక్ట్ సమయంలో ఇది రావడం సంతోషంగా ఉంది. మీరు గొప్పలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు రాశారు' అంటూ ముత్తాతో ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆయన 'మీరు చేస్తున్న ఆక్సీజన్ బ్యాంకుల గురించి మంత్రులు స్పందించి ఉంటే బాగుండేది' అంటూ చెప్పుకొచ్చారు.

    English summary
    Megastar Chiranjeevi recently launched Oxygen Banks in Andhra Pradesh for Covid-19 patients. Now Mutta Gopala Krishna Chiranjeevi Phone Call was Leaked.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X