Padma Awards చిరంజీవికి పద్మ విభూషణ్?.. కేంద్రం అధికార ప్రకటన!
భారతీయ సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి అధ్యాయమే ఉంటుంది. ఆయన సాధించిన విజయాలు, అందుకొన్న అవార్డులు, రివార్డుల ఏ హీరోకు సాధ్య పడని విధంగా ఉంటాయి. ఇండియన్ సినిమాకు చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులను అందజేశారు. అయితే తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల్లో మరోసారి చిరంజీవికి అరుదైన గౌరవం దక్కే అవకాశం ఉంది. ఈ అవార్డు వివరాల్లోకి వెళితే..
Recommended Video

చిరంజీవికి లభించిన అత్యున్నత అవార్డుల్లో కేంద్ర ప్రభుత్వం 2006 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
చిరంజీవి సాధించిన విజయాలు, సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లో రఘుపతి వెంకయ్య అవార్డును ప్రకటించింది.

ఇక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో చిరంజీవిని 2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
ఇక తాజాగా 2024 సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల్లో చిరంజీవి పేరును పరిశీలించారు. త్వరలోనే మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటిస్తారనే వార్త ప్రస్తుతం మీడియాలో సంచలనంగా మారింది. దాంతో అభిమానుల ఆనందానికి హద్దుల లేకుండా ఉంది. ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











