For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి సత్తా చాటిన చిరంజీవి.. ఇండియాలో మొదటి స్థానం.. ప్రపంచంలో 23వ ర్యాంకు

  |
  Megastar Chiranjeevi #Hashtags Trending In Twitter || Filmibeat Telugu

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదగలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన మరోసారి దేశ వ్యాప్తంగా సత్తా చాటారు. దీంతో ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. వివరాల్లోకి వెళితే...

  చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ సందడి (ఫోటో గ్యాలరీ)

  ‘సైరా'తో సెన్సేషన్

  ‘సైరా'తో సెన్సేషన్

  స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు. ఈ సినిమా హిందీతో ఐదు భాషల్లో విడుదల అవుతోంది. దీంతో చిరంజీవి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు.

  ట్విట్టర్‌లో హవా

  ట్విట్టర్‌లో హవా

  ‘సైరా నరసింహారెడ్డి' ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా పడిపోయింది. ఇది ట్విట్టర్‌ ట్రెండింగ్‌తో సుస్పష్టమైంది. #SyeRaaMaking ఇండియాలోనే ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, #SyeRaaNarasimhaReddy రెండో స్థానంలోనూ, #MegastarChiranjeevi, #RamCharan మూడు నాలుగు స్థానాల్లో కొనసాగాయి. ఇలా ఒకే సినిమాకు సంబంధించిన నాలుగు ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉండడం అరుదనే చెప్పాలి. ఇటీవల టీజర్ రిలీజ్ సమయంలోనూ #SyeRaaNarasimhaReddyteaser ట్యాగ్ కూడా టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

  ఎవరి నోట విన్నా చిరంజీవి మాటే

  ఎవరి నోట విన్నా చిరంజీవి మాటే

  మెగాస్టార్ చిరంజీవి గురువారం పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ బుధవారమే హైదరాబాద్‌లో భారీ స్థాయిలో వేడుకను జరుపుకున్న విషయం తెలిసిందే. దీనికి ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక, గురువారం ఉదయం నుంచే పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

  మరోసారి సత్తా చాటిన చిరు

  మరోసారి సత్తా చాటిన చిరు

  ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండడంతో ఆయన మరోసారి ట్రెండ్ అవుతున్నారు. ఆయన పేరుతో రూపొందించిన #HBDEvergreenMegaStar ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత #HBDMegaStarChiranjeevi రెండో స్థానంలో, #SyeRaaNarasimhaReddy మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. అలాగే, #MegaStarBirthday ఐదో స్థానంలో ఉంది. అంటే టాప్ 10లో చిరంజీవి ట్యాగ్స్ నాలుగు ఉండడం విశేషం.

  వరల్డ్ వైడ్‌గానూ ట్రెండ్

  వరల్డ్ వైడ్‌గానూ ట్రెండ్

  చిరంజీవి క్రేజ్ ఖండాంతరాలను దాటిన విషయం తెలిసిందే. అందుకే విదేశాల్లో ఉన్న ఎన్నారైలు సైతం తమ అభిమాన హీరో పుట్టినరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. దీంతో ట్విట్టర్‌లో వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లోనూ #HBDMegaStarChiranjeevi ట్యాగ్ 23వ స్థానంలో కొనసాగుతోంది.

  English summary
  Konidela Siva Sankara Vara Prasad (born 22 August 1955), better known by his stage name Chiranjeevi, is an Indian film actor and politician. He was the Minister of State with independent charge for the Ministry of Tourism, Government of India from 27 October 2012 to 15 May 2014
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X