అభిమాని కల నెరవేరింది: ఇంటికి పిలిచి ‘పవన్ శంకర్’ అని పేరు పెట్టిన చిరంజీవి!
Recommended Video
అతడి పేరు నక్కా వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామం. చిరంజీవికి వీరాభిమాని. అతడి అభిమానం ఏ స్థాయిలో ఉంటుందంటే మెగాస్టార్ సినిమా విడుదలైందంటే అతడికి పండగే. సినిమా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజూ అన్నయ్యను వెండితెరపై చూడాల్సిందే. మెగాస్టార్ పుట్టినరోజు వస్తే తన ఏరియాలో పెద్ద ప్లెక్సీ కట్టి దానికి నోట్ల కట్టలు దండగా వేసి సెలబ్రేషన్స్ చేస్తాడు, చారిటీ కార్యక్రమాలు చేస్తాడు. తన ఇంటికి కూడా మెగాస్టార్ చిరంజీవి నిలయం అని పేరు పెట్టుకున్నాడు.

కుమారుడికి చిరంజీవే పేరు పెట్టాలని సంవత్సర కాలంగా ఎదురు చూపులు
అయితే నక్కా వెంకటేశ్వరరావు అభిమానం ఇక్కడితో ఆగలేదు. తన కుమారుడి పేరు కూడా మెగాస్టార్ పెట్టాలని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాడు. అన్నప్రాసన కూడా చేయించలేదు. ఎట్టకేలకు అతడి కల నెరవేరింది.

ఇంటికి పిలిపించిన చిరంజీవి
నక్కా వెంకటేశ్వరరావు గురించి అభిమాన సంఘాల నేతల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అతడిని తన ఇంటికి పిలిపించారు. సోమవారం చిరంజీవి సమక్షంలోనే వెంకటేశ్వరరావు కుమారుడి పుట్టినరోజు వేడుక జరిగింది.

పవన్ శంకర్ అని పేరు పెట్టిన చిరంజీవి
తన అభిమానికి కుమారుడికి మెగాస్టార్ చిరంజీవి ‘పవన్ శంకర్' అని నామకరణం చేశారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పేరు కూడా వచ్చేలా ఆయన ఈ నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమో
‘పవన్ శంకర్' అని పేరు పెట్టడంపై మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ మీద ఎంతో ప్రేమ ఉండబట్టే ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా నామకరణం చేశాడని చర్చించుకుంటున్నారు. ఈ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











