క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా.. చిరంజీవి వీడియో వైరల్
మత్తు పద్దార్థాల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. మత్తు పదార్థాల వాడకాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. వీటికోసం పోలీసు విభాగం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతోంది. ఈ క్రమంలోనే నేటి మత్తు పదార్థాల వ్యతిరేకం దినోత్సవం సందర్శంగా ఏపీ పోలీస్ విభాగం సెలెబ్రిటీల చేత సందేశాన్ని ఇప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, నానిలు ఈ మేరకు ఏపీ పోలీసులతో చేతులు కలిపారు.

ఏపీ పోలీసుల కార్యక్రమం..
యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఏపీ పోలీస్ ప్రజలకు అవగాహన కలిగించేందుకు ముందుకు వచ్చింది. మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలను వివరిస్తూ.. ఎవ్వరికైనా మత్తు పదార్థాల విక్రయాల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపండని కోరారు. ఈ మేరకు చిరంజీవి, నాని ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు.
చిరు మెసెజ్..
ఈ మేరకు చిరంజీవి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ‘యాంటీ డ్రగ్ ప్రచారం చేయటానికి పూనుకున్న ఏపీ పోలీసు వారిని.. డీజీపీ సవాంగ్ ఇతర అధికారులు వెబినార్ సమావేశంలో పాల్గొన్న వారందరిని స్వాగతిస్తున్నా. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనిషి జన్మ. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్.

క్షణికానందం కోసం..
అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవటం అవసరమ.. క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం. మన మీద ఆధారపడ్డ కుటుంబాల్ని వీధిన పడేయటం సమంజసమా. దురలవాట్లకు బానిసైన మిమ్మల్ని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా.. బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం నందనవనం అవుతుంద'ని చెప్పుకొచ్చాడు.
Recommended Video
మీరు ఎటువైపు..
మత్తు పద్దార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని నాని చెప్పుకొచ్చాడు. మీరు డ్రగ్స్ మాఫియా వైపు ఉంటారా? పోలీసుల వైపు ఉంటారా? అని ప్రశ్నించాడు. అథ: పాతాళానికి తొక్కేందుకు చూసేవే డ్రగ్స్ అని ఒక్క స్టెప్ అటు వైపు వేస్తే జీవితం నాశనం అవుతుందని, దానికి మనం బానిసల్లా తయారవుతామని హెచ్చరించాడు.


Click it and Unblock the Notifications











