‘నాయక్’ సెట్లో మనవరాళ్లతో చిరంజీవి(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: 'పసి పిల్లలు దేవుళ్లతో సమానం. కల్మషం లేని వారి నవ్వుని చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది. షూటింగ్ లేని సమయాల్లో ఇంట్లో పిల్లలందరితో కలిసి గడపడం నాకు చాలా ఇష్టం. వాళ్ల ఆట, పాట చూస్తుంటే సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు'..పిల్లల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'మెగాస్టార్' చిరంజీవి ఈ విధంగా చెబుతుంటారు.

సినిమా హీరోగా ఉన్నప్పుడు మాత్రమే కాదు..రాజకీయ నాయకుడైన తర్వాత కూడా పిల్లల కోసం 'టైమ్' కేటాయించడాన్ని చిరంజీవి విస్మరించడం లేదు. అప్పట్లో తన పిల్లలకు, ఇప్పుడు తన మనవరాళ్లతో గడుపుతున్నారు. తన మనవరాళ్లను ఆయన ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ముద్దులొలికే ఈ చిత్నారులను వెంటేసుకుని ఇటీవల ఆయన నాయక్ లొకేషన్లోకి అడుగు పెట్టారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత తీరిక లేకుండా గడుపుతున్న చిరంజీవి ఇలా మనవరాళ్లతో తమ లొకేషన్లోకి రావడం 'నాయక్' యూనిట్ సభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

మనవరాళ్లతో కలిసి చరణ్ డాన్స్ తిలకించిన చిరంజీవి...
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరో, హీరోయిన్లుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య, రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం నాయక్. ఈచిత్రం కోసం ఇటీవల చరణ్, చార్మి పాల్గొనగా 'ఎవ్వారమంటే ఏలూరు' అనే ప్రత్యేక పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరిస్తున్న సమయంలోనే తమ కుమార్తెలు సుస్మిత, శ్రీజల ముద్దుల తనయలతో చిరంజీవి ఎంటరయ్యారు. చరణ్, చార్మిల డాన్స్ ను మానిటర్ లో తిలకించారాయన.

‘నాయక్’ సెట్లో మనవరాళ్లతో చిరంజీవి(ఫోటోలు)

నాయక్ సినిమా సెట్‌ని మనవరాళ్లతో కలిసి సందర్శించిన మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి. పక్రనే దర్శక నిర్మాతలు వివి వినాయక్, డి వివి దానయ్య. హీరోయిన్ చార్మి, చిత్ర యూనిట్ సభ్యలు.

‘నాయక్’ సెట్లో మనవరాళ్లతో చిరంజీవి(ఫోటోలు)

దర్శకుడు వివి వినాయక్ తో ‘నాయక్' చిత్రానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్న చిరంజీవి.

‘నాయక్’ సెట్లో మనవరాళ్లతో చిరంజీవి(ఫోటోలు)

నాయక్ చిత్రంలో చరణ్, చార్మిలపై ‘ఎవ్వారమంటే ఏలూరు' అనే ప్రత్యేక పాటను చిత్రీకరించారు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తవగానే చరణ్-చార్మి డాన్స్ ను మానిటర్ లో తిలకిస్తున్న చిరంజీవి, యూనిట్ సభ్యలు.

‘నాయక్’ సెట్లో మనవరాళ్లతో చిరంజీవి(ఫోటోలు)

చోటా కె నాయుడుతో చిరంజీవి చిట్ చాట్. కెమెరామెన్ గా చాలా పాపులర్ అయిన చోటా.... ఈ చిత్రంలో తన కెమెరా విభిన్న కోణాలను ఆవిష్కరిస్తుందని వివరించినట్లు ఉంది కదూ ఈచిత్రం....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X