న్యూ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నారు. పూర్తిగా యంగ్ లుక్ లో కనిపిస్తున్న చిరు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డట్లు చెబుతున్నారు. పూర్తి స్థాయి హీరోగా మళ్లీ టాలీవుడ్లో తన మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారు. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద భారీగా పోటీ ఉన్న చిరంజీవి మాత్రం చాలా కాన్ఫిడెంటుగా ఉన్నారట. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











