కొత్త లుక్‌తో అదరగొట్టిన మెగాస్టార్.. ఆచార్యలో చిరుతో నలుగురు హీరోయిన్లు

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా అనంతరం మళ్ళీ కమర్షియల్ ఫార్మాట్ లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఫెయిల్యూర్ లేని దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాతో సరికొత్తగా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆ సినిమాలో నలుగురు హీరోయిన్స్ కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. ఆ వివరాలపై ఒక లుక్కేస్తే..

Recommended Video

Chiranjeevi's Acharya Story Out
న్యూ లుక్ వైరల్..

న్యూ లుక్ వైరల్..

మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత ఆడియేన్స్ ని సరికొత్తగా ఆకట్టుకోవలనే ప్రయత్నం చేస్తున్నారు. సైరాతో మునుపెన్నడు లేని విధంగా కనిపించిన చిరు మళ్ళీ కమర్షియల్ జోన్ లోకి వచ్చే అన్ని వర్గాల ఆడియేన్స్ ని ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. అయితే రీసెంట్ గా మెగాస్టార్ క్లీన్ షేవ్ తో కనిపించి సరికొత్తగా ఆకట్టుకున్నారు. ఇటీవల బ్లఫ్ మాస్టర్ సినిమా చూసిన చిరు దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారు. అతనితో పొటోకి స్టిల్ ఇవ్వడంతో ఇంటర్నెట్ లో ఆ న్యూ లుక్ లీక్ అయ్యింది.

 మెయిన్ హీరోయిన్ కోసం..

మెయిన్ హీరోయిన్ కోసం..

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఆచార్య సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఎందుకు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రెజీనా కసాండ్రా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో ఒక పాటను కూడా చిత్రీకరించారు. కథలో ఆమె పాత్రనే చాలా కీలకమని కూడా కథనాలు వచ్చాయి. ఆ తరువాత మరోక పాత్ర కోసం త్రిషను కూడా అనుకున్నారు.

 ఆమె స్థానంలో మరొకరు?

ఆమె స్థానంలో మరొకరు?

మెగాస్టార్ ప్రేయసిగా త్రిష ఆచార్య సినిమాలో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ లో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగని ఫేక్ న్యూస్ అని కూడా కొట్టి పారేయలేదు. అనంతరం ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ని సెలక్ట్ చేసుకున్నట్లు టాక్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

 రామ్ చరణ్ కోసం..

రామ్ చరణ్ కోసం..

ఇక రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటించే ఛాన్స్ ఉందని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా పవర్ స్టార్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కీయరా అద్వానీని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్ గా మాస్ ఆడియెన్స్ కి కిక్కిచ్చేలా స్పెషల్ సాంగ్ ఉండాలని తమన్నా భాటియాను సెలెక్ట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. మొత్తంగా నలుగురు హీరోయిన్స్ మెగాస్టార్ సినిమాలో స్పెషల్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X