చిరంజీవి కొత్త థమ్సప్ యాడ్ 16 నుంచి
చిరంజీవి నటించిన కొత్త థమ్స్‌అప్ యాడ్ ఏప్రిల్ 16 నుంచి టీవీ ఛానల్స్‌లో ప్రసారం కానుంది. ఈ యాడ్‌లో చిరంజీవి రొటీన్ గెటప్‌లో కాకుండా పొడవైన జుట్టుతో, గడ్డంతో ట్రెండీగా కన్పించనున్నారు. ఈ యాడ్‌ను దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో, ముంబాయిలో చిత్రీకరించారు. థమ్స్ అప్ బాటిల్ ఖాళీగా ఉండడం చూసి, ఆ తర్వాత ఆ బాటిల్‌ను వీరోచితంగా చిరంజీవి సాధించుకోవడం ఈ యాడ్ సారాంశం. ఈ యాడ్ ఫిల్మ్‌కు రామ్ మద్వానీ దర్శకత్వం వహించారు. అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన సాంకేతిక నిపుణులు ఈ యాడ్ ఫిల్మ్ కోసం పనిచేశారు.


Click it and Unblock the Notifications