చిరు వార్త ఎందుకు ప్రచురించలేదంటే..!!!
తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ ప్రారంభించినప్పటినుంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఇప్పటికి కూడా సపోర్ట్ ను అందజేస్తున్న(కాంగ్రెస్ వ్యతిరేక వార్తలు)ఈనాడు పత్రిక అధినేత ఇపుడు మరో కింగ్ ను రూపొందించే ప్రయత్నంలో పడినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ చేతుల నుంచి చంద్రబాబు చేతిలోకి రావడం 2004లో ఆ పార్టీ ఓడిపోవడం, చంద్రబాబు రామోజీ మాట వినే స్థాయిదాటి పోవడంతో జయప్రకాష్ నారాయణను రంగం మీదకు తీసుకు రామోజీ తీసుకువచ్చారు. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణను చేయి పట్టుకొని ఎంత నడిపించిన ఆయన నడవడం నేర్చుకోలేకపోతుండడంతో లాభం లేదనుకుని రామోజీ తన స్టాండ్ ను మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా చిరంజీవిని ప్రమోట్ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. అందుకే చిరంజీవి వార్త తెలుసినా ఆ వార్తను సరైన సమయంలోనే ప్రచురించాలనే ఉద్ధశంతోనే చిరువార్తను ప్రచురించలేదని విశ్లేషకుల అభిప్రాయం.
చిరంజీవి పార్టీ పెట్టడం ఖాయమైనా చిరంజీవి చారిటబుల్ ట్రస్టు నేత్ర విభాగంలో పనిచేస్తున్న చిరు మిత్రుడు డాక్టర్ ప్రసాదరెడ్డి మీడియా ముందు నోరు జారాడని మరో ప్రముఖ పత్రికలో విశ్లేషించారు. అలా నోరు జారడంతో ప్రజల మనోభావాలు తెలుసుకోగోరడం సమంజసం కాదనే ఉద్ధేశంతోనే ఆ వార్తను ఈనాడు ప్రచురించలేదని అనుకుంటున్నారు. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టే ముందు తుపాను ముందు ప్రశాంతతను ప్రదర్శించాలనేది రామోజీ ఎత్తుగడగా చెప్పుకుంటున్నారు. అనవసరంగా ప్రసాదరెడ్డి వార్తను లీక్ చేయడం రామోజీకి నచ్చలేదని సమాచారం. అందుకే మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నాయకుల స్పందనను తీసుకున్నప్పటికీ ప్రచురణ, ప్రసారం జరపలేదని సమాచారం. ఇదే నిజమైతే రాష్ట్రంలో చిరంజీవితో రామోజీ మరో పెనుసంచలనమే సృష్టిస్తాడు. కింగ్ మేకర్ గా ఉండడానికే ఇష్టపడే రామోజీ, చిరంజీవిని కింగ్ ను చేసి కాంగ్రెస్ ను లక్ష్యంగా వదులుతారో లేక అన్ని పార్టీల పైకి వదులుతారో వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఏదో ఆలోచన ఉండడం వలననే రామోజీ చిరువార్తలను ప్రచురించ లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











