వచ్చే నెల చిరంజీవి సిన్మా ప్రకటన?
ఇక సినిమాల్లో నటించను, రాజకీయాల్లో జీవిస్తాను అని చిరంజీవి స్పష్టం చేసినా ఆయన మనసు మరికొన్ని సినిమాలు చేయాలని పోరుపెడుతున్నట్టు తెలుస్తోంది. ఒక సినిమా కోసం ఆయన ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టు సమాచారం. కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమా "మగధీర" విడుదల అయిన తర్వాత చిరు మెగా సినిమా ప్రకటన విడుదలయ్యే అవకాశముంది.
ఆగస్టు 22 న చిరంజీవి జన్మదినం రోజున ఆ సినిమా ప్రకటన వెలువడే అవకాశముంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నటించిన ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని చిరంజీవి మళ్ళీ నటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
More from Filmibeat
chiranjeevi magadheera ram charan politics birthday ground work ntr చిరంజీవి మగధీర రామ్ చరణ్ రాజకీయాలు సినిమా ఎన్టీఆర్


Click it and Unblock the Notifications











