'తమ్ముడి' దర్శకత్వంలో 'అన్నయ్య'
జల్సా చిత్రం తర్వాత ప్రజారాజ్యం పార్టీ పనుల్లో నిమగ్నమయిపోయిన పవన్ కళ్యాన్, ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీకి దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ మధ్యనే చిరంజీవి పుట్టిన రోజునాడు తిరిగి పార్టీ పనుల్లో పాల్గొంటానని చెప్పినప్పటికీ, ఆయన దృష్టి సినిమాలపైనే వుందని సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం కొమరం పులి చిత్రంతో బిజీగా వున్న పవన్ దీని తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించనున్నారు.
తాజాగా ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచనలో వున్నట్టు విశ్వసనీయ కథనం. జానీ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహించబోయే చిత్రం ఇదే. చిరంజీవి 150వ చిత్రంగా ఇది రాబోతోందనీ, అన్నకు తగిన స్ర్కిప్ట్ కోసం అన్వేషిస్తున్నారని సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందని తెలిసింది.
More from Filmibeat
chiranjeevi pawan kalyan komaram puli sjsurya praja rajyam poori jagannath jalsa magadheera ram charan చిరంజీవి పవన్ కళ్యాన్ జల్సా కొమరం పులి ప్రజారాజ్యం పూరీ జగన్నాథ్


Click it and Unblock the Notifications











