త్రివిక్రమ్‌తో రాంచరణ్ సెట్ చేశాడు.. అలా నన్ను ఇరికించాడు.. చిరంజీవి సైరా తర్వాత..

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమా గురించే అనేక రకాలైన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నాడనే వార్త ఇటీవల హల్ చల్ చేసింది. కానీ అలాంటి వార్తలకు తెరదించుతూ తాను చేయబోయే సినిమా గురించి వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాంబు పేల్చాడు. మెగాస్టార్ చిరంజీవి ఎవరితో సినిమా చేయబోతున్నాడంటే..

నిర్మాత డీవీవ దానయ్య గురించి

నిర్మాత డీవీవ దానయ్య గురించి

నిర్మాత దానయ్య చాలా అదృష్టవంతుడు. భరత్ అనే నేను సినిమాతో సక్సెస్ సాధించాడు. ఈ సంక్రాంతికి వినయ విధేయ రామతో విజయాన్ని అందుకోబోతున్నారు. అలాగే వచ్చే సంక్రాంతికి అపజయం ఎరుగని రాజమౌళితో RRR సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు. ఆయన ప్లానింగ్ కూడా చక్కగా ఉంది. ఆయనను చూసి తోటి నిర్మాతలు ఈర్ష పడే పరిస్థితి వచ్చింది.

 తొమ్మిదేన్నర ఏళ్ల తర్వాత అవకాశం

తొమ్మిదేన్నర ఏళ్ల తర్వాత అవకాశం

తొమ్మిదిన్నర ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఓ సినిమా చేశాను. అది రాంచరణ్‌తో చేసిన బ్రూస్ లీ. ఆ సినిమాలో నాకు రీఎంట్రీ మాదిరిగా నాకు అవకాశం ఇచ్చాడు. అప్పుడే ఆయనతో సినిమా చేయాలని అనిపించింది. నేను ఏ ముహుర్తంలో అనుకొన్నానో తెలియదు గానీ.. త్వరలోనే ఆయనతో సినిమా చేయడానికి అవకాశం లభించింది.

ఉత్సాహం ఆపుకోలేక చెప్పాను

ఉత్సాహం ఆపుకోలేక చెప్పాను

రాంచరణ్‌కి ఇష్టమైన నిర్మాత డీవీవీ దానయ్య, పవన్ కల్యాణ్‌కు ఆప్తుడు, నాకు ఆత్మీయుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాను. ఇది సందర్భం కాకపోయినా నేను నా ఉత్సాహం ఆపుకోలేక చెప్పాల్సి వచ్చింది.

 రాంచరణ్ అలా సెట్ చేశాడు

రాంచరణ్ అలా సెట్ చేశాడు

దానయ్య, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌తో సినిమా సెట్ చేసింది రాంచరణ్‌. దానయ్యతో రెండు సినిమాలు చేయడమే కాకుండా రాంచరణ్ నన్ను ఇరికించాడు. మంచి నిర్మాతను ఇచ్చినందుకు రాంచరణ్‌కు థ్యాంక్స్. ఎప్పటి నుంచో త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఉండేది. ఆ కోరిక కూడా తీరింది. ఉత్సాహం ఆపుకోలేక చెప్పినందుకు క్షమించాలి.

స్విట్జర్లాండ్‌లో పవన్ కల్యాణ్

స్విట్జర్లాండ్‌లో పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో క్రిస్మస్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. తమ్ముడు ఉంటే తను కూడా ఈ వేడుకను చూసి ఆనందించేవాడు. ఏదిఏమైనా వినయ విధేయ రామ సినిమా అందరికీ సంతోషాన్ని ఇచ్చే సినిమాగా మారబోతున్నందుకు ఆనందంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X