For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'జంజీర్‌' రీమేక్‌లో గెస్ట్ విషయపై... చిరు ఖండన

  By Srikanya
  |

  హైదరాబాద్: రామ్ చరణ్ తాజాగా 'జంజీర్‌' రీమేక్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సైతం విడుదల కానున్న ఈ చిత్రంలో చిరంజీవి కనిపిస్తారనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన్ని మీడియా ప్రస్నించింది. ఆ వార్తను చిరంజీవి ఖండించారు. ఆయన ఈ విషయమై వివరణ ఇస్తూ... కొన్ని వార్తలు ఎలా పుడతాయో అర్థం కాదు. రామ్‌చరణ్‌ తొలి హిందీ చిత్రం 'జంజీర్‌'. అందులో నేను నటిస్తున్నాననే వార్తలు చదివి నేనూ ఆశ్చర్యపోయాను. అందులో నేను నటించడం లేదు అన్నారు.

  ఇక తన కుమారుడు రామ్‌చరణ్‌ బాలీవుడ్‌ ప్రవేశంపై స్పందిస్తూ... ఒకింత గర్వంగా, సంతోషంగా ఉంది. (నవ్వుతూ) ఈర్ష్యగా కూడా ఉంది. ఎందుకంటే నేను నటన మొదలుపెట్టిన పన్నెండేళ్ల తరవాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది.. 'ప్రతిబంధ్‌' రూపంలో! కానీ చరణ్‌కి మూడేళ్లలోనే ఛాన్స్‌ వచ్చింది. అది కూడా 'జంజీర్‌' లాంటి విజయవంతమైన చిత్రం రీమేక్‌లో. ఆ అవకాశం నిజంగా ఓ అదృష్టం. ఎందుకంటే అమితాబ్‌బచ్చన్‌కి యాంగ్రీ యంగ్‌మెన్‌గా గుర్తింపు వచ్చింది ఆ సినిమాతోనే అన్నారు. తన కుమారుడు కూడా ఆ రేంజిలో సక్సెస్ అవుతారనే ఆశాభావం వ్యక్తం చేసారు.

  అలాగే జంజిర్ చిత్రం కథ గురించి మాట్లాడుతూ.. నిజాయతీపరుడైన పోలీసు అధికారికీ, చీకటి సామ్రాజ్యానికీ మధ్య సాగే యుద్ధంతో ఆ కథ నడుస్తుంది. ఏ కాలానికైనా తగిన కథ ఇది. చరణ్‌కి సరిపడే కథ అన్నారు. ఇక రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుతూ...'రచ్చ' సినిమాలోని చరణ్‌ నటనలో చాలా పరిపక్వత కనిపించింది. చాలామంది విశ్లేషించినట్లే తన నృత్యాల్లో ఇంతకు ముందు కన్నా చక్కటి పరిణతి, సహజత్వం వచ్చాయి. ముఖ్యంగా 'వాన వాన...' పాట విషయానికొస్తే - చరణ్‌లో నన్ను నేను చూసుకొన్నాను. ఆ భావోద్వేగాన్ని తలచుకొంటే చాలా థ్రిల్‌గా అనిపిస్తుంటుంది. నా శైలి నటన, నృత్యం అనేవి చరణ్‌లో అనుకరించినట్లుగా కాకుండా సహజంగా ఉండటంతో అందరూ ఎంజాయ్‌ చేశారని నా భావన అన్నారు.

  తన కుమారుడుపకి సినిమాల ఎంపికలో సూచనల గురించి చెపుతూ...తన చిత్రాల ఎంపికలో నా ప్రమేయం ఏమీ లేదు. నా సినిమాలే సూచికలుగా, సూచనలుగా తీసుకొంటున్నాను అని తనే ఓ సందర్భంలో చెప్పాడు అన్నారు. అలాగే తను 150వ చిత్రం చేస్తే... అది చారిత్రకమా? పౌరాణికమా? సాంఘికమా? అని కాదని...ఇది మైలురాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో కొందరు నాతో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' తీయాలని ఆసక్తి చూపించారు. ఆ కథాంశం నాకూ నచ్చింది. అయితే 150వ చిత్రం చేస్తే అది ఎలాంటి కథాంశంతో ఉంటుందనేది సమీప భవిష్యత్తు నిర్ణయిస్తుంది అన్నారు.

  English summary
  Chiru says that he is not acting in Charan’s Bollywood debut flick. ‘I’ve entered Bollywood after 12 years of illustrious career here in the form of Pratibandh movie. But Charan is quite lucky and he is fortunate enough to get a film like Zanjeer’, he stressed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X