ట్రైన్ యాక్సిడెంట్‌పై ఎన్టీఆర్ దిగ్బ్రాంతి.. ఫ్యాన్స్‌కు చిరంజీవి రిక్వెస్ట్.. ఏ హీరో ఏం చెప్పాడంటే!
హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒరిస్సాలోని బాలాసోర్ దగ్గరలోని బహానగర్ బజార్ స్టేషన్ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్ రైలును శుక్రవారం రాత్రి ఢీకొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్‌లో యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు యశ్వంత్‌పూర్ హౌరా రైలుకు తగిలాయి. ఈ ఘటనలో 200లకు పైగా మరణాలు సంభవించాయి. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్ ఘటనపై హీరోలు ఎలా స్పందించారో చూద్దాం పదండి!

అక్షయ్ కుమార్ స్పందన: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్‌పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. ఈ కష్ట సమయంలో బాధితులకు సానుభూతిని తెలుపుతున్నాను. ఓం శాంతి' అంటూ రాసుకొచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్: కోరమండల్ ప్రమాదంపై ఎన్టీఆర్ ట్విట్టర్‌లో స్పందించాడు. అందులో 'రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు, వారి సన్నిహితులకు హృదయపూర్వక సానుభూతిని తెలుపుతున్నాను. ఈ విధ్వంసకర సంఘటన వల్ల ప్రభావితమైన ప్రతి వ్యక్తికి మనోధైర్యం చేకూరాలని కోరుతున్నాను. ఈ కష్ట సమయంలో అందరూ వారికి అండగా ఉండాలి' అంటూ చెప్పుకొచ్చాడు.
మంచు మనోజ్ బాధగా: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్‌పై మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. అందులో 'రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు, వారి సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విధ్వంసకర సంఘటన వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నా ప్రార్థనలు. ఈ క్లిష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని దేవుడిని కోరుకుంటున్నాను' అంటూ పేర్కొన్నాడు.
వరుణ్ తేజ్ ఆవేదనతో: కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్‌పై వరుణ్ తేజ్ స్పందిస్తూ.. 'కోరమాండల్ రైలు ప్రమాదంలో బాధితులైన, వారి కుటుంబాలను చూసి నా హృదయం వేదన చెందుతోంది. ఈ భయానక సంఘటనతో ప్రభావితమైన ప్రతి వ్యక్తికి మనోధైర్యం చేకూరాలని కోరుతున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి ఓదార్పు, మద్దతును కలుగజేయాలి' అంటూ ట్వీట్ చేశాడు.
కల్యాణ్ రామ్ దిగ్బ్రాంతి: కోరమండల్ రైలు ప్రమాదంపై నందమూరి కల్యాణ్ రామ్ స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో 'ఒరిస్సాలో జరిగిన రైలు ప్రమాదం నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇందులో బాధితులైన వారికి సానుభూతిని తెలుపుతున్నాను. ఈ దుఃఖ సమయంలో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ శక్తి, శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చాడు.
వాళ్లదే బాధ్యత: నిఖిల్: రైలు ప్రమాదంపై నిఖిల్ స్పందిస్తూ.. 'ఈ విషాద రైలు ప్రమాదంలో బాధితులుగా మిగిలిన వాళ్లను చూసి హృదయం చలించిపోతుంది. రైళ్లు సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతోనే తప్ప.. ఇలాంటివి జరగడానికి కాదు. ఇంకెప్పుడూ ఇలాంటి ఘటనలు జరగకూడదు. రైల్వే శాఖ దీనికి బాధ్యత వహిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు.
రక్తదానం చేయండంటూ: కోరమండల్ ప్రమాదంపై చిరంజీవి స్పందిస్తూ.. 'ఇది ఊహకి అందని విషాదం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురి కావడంతో షాక్‌కు గురయ్యాను. బాధితులకు నా సానుభూతి. గాయపడ్డ వారికి తప్పనిసరిగా రక్తం అవసరం అవుతుంది. కాబట్టి సమీపంలో ఉన్న నా అభిమానులు మీకు చేతనైనంత వరకు రక్త దానం చేయండి. ప్రాణాలు నిలబెట్టండి' అని పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











