అజ్ఞాతవాసి ఆడియోకు ఆ ఇద్దరు.. దిమ్మతిరిగే ఈక్వేషన్లు.. ఫ్యాన్స్ ముందే సంక్రాంతి

By Rajababu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే చెప్పలేనంత క్రేజ్. గత చిత్రాలు హిట్టా ఫట్టా అనే తేడా లేకుండా క్రేజ్ ఉంటుంది. సాధారణంగా ఏ హీరోకైనా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే వారికి పెద్దగా క్రేజ్ కనిపించదు. కానీ ఫ్లాప్‌లకు, విజయాలకు పవన్ అతీతం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ తాజా చిత్రం అజ్ఞాతవాసి సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక మంగళవారం (డిసెంబర్ 19న) హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగనున్నది. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా ఇద్దరు వ్యక్తులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇద్దరు ఎవరంటే..

Recommended Video

ఆడియో రిలీజ్ కు వారిని పిలువొద్దు..!
 చిరుతో సానుకూలంగా

చిరుతో సానుకూలంగా

గత కొద్దికాలంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య రిలేషన్స్ రాజకీయంగా అంతంత మాత్రమే అనే మాట మీడియాలో నానుతున్నది. పవన్, చిరు కలిసి కనిపిస్తున్న సన్నివేశాలు అరుదే. అయితే ఈ మధ్య పవన్ చేపట్టిన రాజకీయ పర్యటనల్లో చిరంజీవి గురించి సానుకూలంగా మాట్లాడటం కొసమెరుపు. దాంతో వారి మధ్య దూరం కొంత తగ్గినట్టే అని వినిపిస్తున్నది.

పవన్, ఎన్టీఆర్ కలయిక

పవన్, ఎన్టీఆర్ కలయిక

ఇక మెగా హీరోల ఫంక్షన్లకు నందమూరి హీరోలు వచ్చిన సందర్భాలు అసలే కనిపించవు. కానీ ఈ మధ్య ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ముహుర్తం షాట్‌కు పవన్ హాజరు కావడం జరిగింది. ఎన్టీఆర్, పవన్ కలయిక విషయంపై పెద్దగానే చర్చ జరిగింది.

అజ్ఞాతవాసికి ఇద్దరి అండ

అజ్ఞాతవాసికి ఇద్దరి అండ

ఇలాంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు చిరంజీవి, జూ. ఎన్టీఆర్‌లు హాజరవుతున్నారనే వార్త మీడియాలో హంగామా సృష్టిస్తున్నది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ గానీ, ఆయా హీరోల ఫ్యాన్స్ గానీ పెదవి విప్పడం లేదు.

 ఎన్టీఆర్ హాజరు వార్త నిజమే..

ఎన్టీఆర్ హాజరు వార్త నిజమే..

అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి, ఎన్టీఆర్ హాజరవుతున్న వార్త నిజమే అని కొన్ని వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం ఉందనే మాట కూడా వినిపిస్తున్నది. ఎందుకంటే ఎన్టీఆర్ నటించే తదుపరి చిత్రం ఎస్ రాధాకృష్ణ నిర్మాణ సారథ్యంలోనే కావడంతో ఆ వార్త మరింత బలపడింది.

 జనసేనలోకి చిరంజీవి

జనసేనలోకి చిరంజీవి

ఒకవేళ చిరంజీవి, తారక్ అజ్ఞాతవాసి ఆడియోకు హాజరైతే రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెర లేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చిరంజీవి జనసేన పార్టీలో చేరుతారని, పార్టీలో కీలక బాధ్యతలను ఆయన స్వీకరిస్తారనే న్యూస్ ప్రచారంలో ఉంది.

 పవన్‌ కల్యాణ్‌కు ఎన్టీఆర్ అండ

పవన్‌ కల్యాణ్‌కు ఎన్టీఆర్ అండ

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అధికార పార్టీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్, ఎన్టీఆర్ కలవడం వ్యూహాత్మకమే అనే మాట వినిపిస్తున్నది. పవన్‌పై ఎన్టీఆర్ సానుకూలత జనసేనకు కలిసి వచ్చే అంశం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.

ఆడియో వేడుకపై ఆసక్తి

ఆడియో వేడుకపై ఆసక్తి

జనసేన విస్తృత ప్రచారం చేపట్టడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో రాజకీయంగా కొన్ని వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ చేయాల్సి రావొచ్చు. దీంతో ఈ ఆడియో వేడుకకు చాలా రాజకీయ, సినీ ప్రధాన్యత ఏర్పడింది. ఈ వేడుకను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X