కొన్నేళ్లు వెనక్కి వెళితే మెగాస్టార్ చిరంజీవి ఇలా...(ఫోటోలు)
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవి నిర్వహిస్తూ రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్లినా....అభిమానుల బాగోగులు చూసుకోవడంలో మాత్రం చిరంజీవి ముందే ఉంటున్నారు. ఇటీవల బస్సు ప్రమాదంలో మరణించిన మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు చిరంజీవి.
కాసేపు ఈ రాజకీయాల సంగతి పక్కన పెట్టి మెగాస్టార్ సినిమా జ్ఞాపకాల్లోకి వెళదాం. అభిమానులంతా మెగాస్టార్ 150వ సినిమా ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సినిమా చేసే అవకాశాలు లేక పోయినా....ఎప్పటికైనా తమ ఆశ నెరవేరుతుందనే ఆలోచనలో ఉన్నారు. తనకు సినిమా చేసే సమయం లేక పోయినా, వారిని నొప్పించకుండా ఉండటానికి తనకు సూటయ్యే మంచి కథ దొరికితే చూద్దాం, సమయం అనుకూలిస్తే చేద్దాం అని అభిమానులను ఊరిస్తూ నెట్టుకొస్తున్నారు చిరంజీవి.
కాగా చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో పలు వ్యాపార ప్రకటనల్లోనూ నటించారు. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్లో దర్శనం ఇస్తూ ఆయన అభిమానులను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెలుతున్నాయి. స్లైడ్ షోలో ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

కేంద్ర మంత్రి స్థాయికి..
అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో అగ్రస్థానానికి ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా స్వత్రంత్ర హోదాలో కొనసాగుతున్నారు. తనదైన ఆలోచనలతో దేశ పర్యాటక రంగ అభివృద్ధికి పాటుపడుతున్నారు.

థమ్సప్ యాడ్లో..
చిరంజీవి గతంలో థమ్సప్ యాడ్లో నటించారు. తాజాగా సోషల్ నెట్వర్కింగులో అందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

మెగాస్టార్
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. నిన్నటితరం హీరోల్లో ఇండస్ట్రీలో నెం.1 స్థానంలో హవా కొనసాగించిన ఘనత ఆయనది.

మెగా ఫ్యాన్స్
మెగాస్టార్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయన ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

మెగా ఫ్యామిలీ
మెగాస్టార్ వారసులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు.

సినిమా టు పాలిటిక్స్
సినిమా స్టార్స్ పొలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం మన దేశంలో కొత్తేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి కూడా అదే దారిలో ప్రయాణించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications











