»   »  చిరంజీవి మాకు బాకీపడ్డారు : పూరి జగన్నాథ్

చిరంజీవి మాకు బాకీపడ్డారు : పూరి జగన్నాథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారి కేంద్ర మంత్రిగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22తో 58వ వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలకు దూరంగా ఉంటున్నా ఆయన నుంచి 150 సినిమా వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు, ఆసక్తికరంగా ట్వీట్ చేసారు. 'మెగాస్టార్‌‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సినిమాలు చూస్తూ పెరిగాము. కానీ మీరు మాకు ఒక సినిమా బాకీ పడ్డారు. అది ఎప్పుడు?' అంటూ వ్యాఖ్యానించారు.

Chiranjeevi and Puri Jagannadh

చిరంజీవి చివరి సారిగా 2009లో రామ్ చరణ్ నటించిన 'మగధీర' చిత్రంలో గెస్ట్‌రోల్ కనిపించారు. ఆ తర్వాత ఆయన ఏ సినిమాలోనూ కనిపించలేదు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత నటించడం మానేసిన చిరు తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజకీయాల్లో మరింత బిజీ అయ్యారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా తీరకలేకుండా గడుపుతున్నారు. ఇప్పటి వరకు 149 చిత్రాల్లో నటించిన చిరంజీవి 150వ సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

<blockquote class="twitter-tweet blockquote"><p>Long live MEGA STAR happy birthday మీ సినిమాలు చూస్తూ పెరిగాం . కాని మీరు మాకు ఒక్క సినిమా బాకీ ఉన్నారు . అది ఎప్పుడు ?</p>— puri jagan (@purijagan) <a href="https://twitter.com/purijagan/statuses/370412013370875904">August 22, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

English summary
Puri Jagannadh took to his Twitter page to wish Chiranjeevi. The director wrote, "Long live MEGA STAR happy birthday Mee cinemalu choostu perigamu. Kani meeru maaku oka cinema bakipaddaru. Adi eppudu (We grew up watching your films, but you owe us one film. When will you repay?)"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X