జనవరి 18 లేదా ఫిబ్రవరి 18న చిరు పార్టీ?
ఆయన పార్టీ పెడతారో లేదో కానీ ఆంధ్ర రాష్ట్రమంతా ఉత్కంఠగా ఉంది. మధ్యంతర ఎన్నికలు మార్చిలో ఉండవచ్చని తాజాగా గురువారంనాడు పత్రికలలో వార్త ప్రత్యక్షమయ్యే సరికి మళ్లీ చిరంజీవి పార్టీ అంశం తెరమీదకు వస్తోంది. అవునని కానీ కాదని కానీ స్పష్టం చేయని చిరంజీవి జనవరి 18న కానీ ఫిబ్రవరి 18న కానీ పార్టీని ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. జనవరి 18 స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కావడం విశేషం. ఆ రోజే పార్టీని ప్రారంభిస్తే ఎన్టీఆర్ కమ్యూనిటీకి చెందిన వారి మనసు దోచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా యోచిస్తున్నారు. ఒకవేళ ఆ రోజు సాధ్యం కాకపోతే ఫిబ్రవరి 18న పార్టీని ప్రారంభించవచ్చని అనుకుంటున్నారు. మరేమవుతుందే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











