నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మూవీ ప్రారంభోత్సవానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్
హైదరాబాద్: చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒకే కార్యక్రమంలో కలిసి కనిపించబోతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం ప్రారంభోత్సవం రేపు (ఫిబ్రవరి 27)న జరుగనుంది. మాటీవీలో ఈకార్యక్రమం లైవ్ ప్రసారం చేయనున్నారు.
వరుణ్ తేజ్‌ను సినీరంగానికి పరిచయం చేయడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పక్కాగా స్టోరీ, స్క్రిప్టు రెడీ చేసాడు. గోదావరి ఏరియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లియో ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

సాలిడ్‌గా ప్రమోషన్స్
నాగబాబు కొడుకు వరుణ్ తేజను ప్రమోట్ చేయడానికి మెగా హీరోలంతా కలిసి పని చేయనున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

నాగబాబు పర్ ఫెక్ట్ ప్లానింగ్
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు స్వయాన సోదరుడైన నాగబాబు....తన కొడుకు ఎంట్రీ కోసం పర్ ఫెక్టుగా ప్లానింగ్ చేసారు. గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎంట్రీ సందర్భంగా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న అనుభవం నాగబాబుకు ఉంది.

మెగా న్యూ జనరేషన్ హీరోలు
ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ తెరంగ్రేటం చేసి సక్సెస్ అయ్యారు....వీరి దారిలోనే సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్ తదితరులు పరిశ్రమలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

గోదావరి బ్యాక్ డ్రాపుతో వరుణ్ తేజ్ సినిమా
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గత చిత్రాల రెండింటిలోనూ గోదావరి జిల్లా అందాలు, అక్కడ జనాలు మాట్లాడే యాస కనిపిస్తుంది. ఇప్పుడు తన మూడో చిత్రానికి సైతం గోదావరి జిల్లాల నేపథ్యాన్ని ఎంచుకున్నారు. గొల్లభామ టైటిల్‌తో రూపొందే ఈ చిత్రం గోదావరి దగ్గర ఓ పల్లెలో జరిగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తోంది.

రాటు దేలిన వరుణ్ తేజ్
మెగా హీరోలంటే...కమర్షియల్ సినిమాలకు మారు పేరు. అతి తక్కువ కాలంలోనే మాస్ హీరోలుగా నిలదొక్కుకునే సత్తా ఉన్నోళ్లు. ఇందుకు అనుగుణంగా డాన్సులు, యాక్టింగ్, ఫైట్ష్ విషయంలో వరుణ్ తేజ్ రాటు దేలాడు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడట.


Click it and Unblock the Notifications











