Indira Devi: మహేశ్‌కు అండగా టాలీవుడ్ స్టార్స్.. చిరంజీవి అలా.. బాలయ్య ఇలా.. పవన్ ఏం చేశాడంటే!
వరుస విషాదకర సంఘటనలతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవలే రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యం కారణంగా బుధవారం ఉదయం మరణించారు. ఆమె మరణంతో ఘట్టమనేని అభిమానులతో పాటు సినీ ప్రియులంతా విషాదంలో మునిగిపోయారు. దీంతో సినీ ప్రముఖులు, సన్నిహితులు కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా దేవి మృతిపై సెలెబ్రిటీలు చేసిన ట్వీట్లను చూద్దాం పదండి!

సోషల్ మీడియా ద్వారా సంతాపం
సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆమె మృతిపై ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. అంతేకాదు, మహేశ్ ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు.

సోదరుడు మహేశ్‌కు సానుభూతి
ఇందిరా దేవి మరణంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో స్పందించారు. ఈ మేరకు 'శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకు , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను' అంటూ అందులో పోస్ట్ చేశారు.

మహేశ్‌కు మనోధైర్యం ఇవ్వాలని
ఇందిరా దేవి మృతిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. 'ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నాను' అంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు.

చాలా బాధకరమన్న బాలకృష్ణ
ఇందిరా దేవి మరణ వార్తపై బాలకృష్ణ స్పందించారు. ఈ మేరకు 'కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ప్రకటన వదిలారు.

సంతాపం తెలిపిన నటి కాజల్
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మదర్ ఇందిరా దేవి మరణంపై ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'ఇందిరా దేవి గారి ఆకశ్మిక మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను. మహేశ్ బాబు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఓం శాంతి' అంటూ పోస్ట్ చేసింది.

సంతాపం తెలిసిన హీరో నాగార్జున
సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి మరణంతో టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఇలా ఎంతో మంది ప్రముఖులు ప్రకటనలను కూడా వదిలారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో 'సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను' అంటూ పోస్ట్ చేశాడు.

సురేందర్ రెడ్డి, కోన వెంకట్ ట్వీట్స్
ఇందిరా దేవి మరణంపై డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పందిస్తూ.. 'ఇందిరా దేవి గారి మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కృష్ణ గారు, మహేశ్ కుటుంబానికి సానుభూతిని తెలుపుతున్నా' అని ట్వీట్ చేశాడు. అలాగే, కోన వెంకట్ 'ఇందిరా దేవి గారి మరణ వార్తతో షాక్‌కు గురయ్యాను. కృష్ణ, మహేశ్ గారి కుటుండానికి సానుభూతిని తెలుపుతున్నా' అంటూ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











