Happy Birthday KTR : చిరు, పవన్, చెర్రీ ట్వీట్స్ వైరల్
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మెగా ఫ్యామిలీకి ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు పరిచయమైన స్నేహబంధం నేటికీ కొనసాగుతోంది. కేటీఆర్ మెగా ఈవెంట్లకు అతిథిగా విచ్చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్‌తో కేటీఆర్ అత్యంత సన్నిహితంగా ఉంటాడు. సినిమా పరిశ్రమ, సెలెబ్రిటీలతో కేటీఆర్ మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తూ ఉంటాడు. నేటి (జూలై 24) కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రాజకీయ వర్గాల నుంచే కాక సినీ పరిశ్రమ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
దాదాపు టాలీవుడ్ చిత్ర సీమ మొత్తం కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, నిర్మాణ సంస్థలు ఇలా అందరూ కేటీఆర్ బర్త్ డే సందర్బంగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరికి ప్రతిగా కేటీఆర్ కూడా ధన్యవాదాలు తెలిపాడు.

'సామాన్య జనాలకు, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం, స్పందించే వ్యక్తిత్వం వల్ల నేను ఎప్పుడు సంతోషిస్తాను, అందుకు నీకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా సేవ చేసేందుకు నీకు మరింత శక్తి చేకూరాల'ని చిరు కోరకున్నాడు. రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ. 'ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతంగా పని చేసి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నావ్.. పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్' అని పేర్కొన్నాడు. 'నా మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.. నీకు సుఖశాంతులు చేకూరాలని చిలుకూరు బాలాజీని ప్రార్థిస్తున్నాను నా ప్రియ సోదర' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











