బిగ్ బీకి వెల్లువెత్తుతున్న అభినందనలు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, రజినీకాంత్ ఏమన్నారంటే!

Recommended Video

Amitabh Bachchan Gets Dadasaheb Phalke Award || బిగ్ బీకి వెల్లువెత్తుతున్న అభినందనలు!!

బాలీవుడ్ బడా స్టార్ అమితాబ్ బచ్చన్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. ఆయనకు దక్కిన ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. ఈ మేరకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, మోహన్ లాల్, కింగ్ నాగార్జున తమ తమ అభినందనలను తెలియజేశారు. వివరాల్లోకి పోతే..

మెగాస్టార్ చిరు స్పందన..

మెగాస్టార్ చిరు స్పందన..

లివింగ్ లెజెండ్ శ్రీ అమితాబ్ బచ్చన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 1969లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారని, గడిచిన యాభై వసంతాల కాలంలో చరిత్రలో నిలిచిపోయే ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారని పేర్కొన్నారు. యుక్తవయసులో యాంగ్రీ యంగ్ మెన్ అనిపించుకున్న అమితాబ్ జీ.. ఇప్పుడు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని, తాను పోషించే ప్రతి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారని కొనియాడారు.

సైరా.. విడుదల కాబోతున్న శుభ తరుణంలో

సైరా.. విడుదల కాబోతున్న శుభ తరుణంలో

'సైరా... నరసింహారెడ్డి' చిత్రంలోనూ నా గురువు గోసాయి వెంకన్న పాత్రను ఆయన పోషించడం నాకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ చిత్రం విడుదల కాబోతున్న శుభ తరుణంలో అమితాబ్ జీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం మరింత సంతోషాన్ని కలిగించిందని చిరు పేర్కొన్నారు. ఈ సందర్బంగా అమితాబ్‌కి హార్దిక శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పటికే పద్మశ్రీ,, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన అమితాబ్ బచ్చన్ జీ చిత్రసీమకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం మా యూనిట్ మొత్తంలో ఆనందోత్సాహాలను నింపిందని చిరు చెప్పారు.

మీరే సరైన అర్హులు.. రజినీకాంత్ ట్వీట్

అమితాబ్‌ దక్కించుకున్న ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన ఆయన.. ''అమితాబ్ జీకి అభినందనలు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడానికి మీరు సరైన అర్హులు'' అని పేర్కొన్నారు. రజనీకాంత్ చేసిన ట్వీట్ పై తమిళ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ అమితాబ్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

బిగ్‌బీ అంటేనే అలుపెరుగని కెరటం.. పవన్ కళ్యాణ్

సుప్రసిద్ద నటులు అమితాబ్ బచ్చన్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు కేంద్రం ఎంపిక చేసిందనే వార్త తనకెంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బిగ్‌బీ అంటేనే అలుపెరుగని కెరటం అని, ఆయన నట జీవితం గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం అని, నటనలో ఆయన తనకంటూ ఓ ఒరవడిని సృష్టించుకొన్నారని పవన్ కొనియాడారు. వారికి జనసైనికులు, నా తరఫున హృదయపూర్వక అభినందనలు అని పవన్ పేర్కొన్నారు.

మోహన్ లాల్, నాగార్జున ఏమన్నారంటే..

దాదా సాహెబ్ పురస్కారం అర్హత కలిగిన వ్యక్తినే వరించిందని మోహన్‌లాల్ పేర్కొనగా, అమితాబ్ తన నటనతో కోట్లాది మందికి వినోదం పంచడంతో పాటు అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని, అలాంటి మహా నటుడికి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని నాగార్జున ట్విట్టర్ లో తన ట్వీట్ పోస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X