twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆలీ తల్లికి నివాళులు అర్పించిన మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే!

    |

    Recommended Video

    ఆలీ తల్లికి నివాళులు అర్పించిన మెగాస్టార్

    కమెడియన్ ఆలీ తల్లి జైతున్ బీబీ నిన్న (డిసెంబర్ 18) రాత్రి 11 గంటల 41 నిమిషాలకు మరణించారు. ప్రస్తుతం ఆమె వయస్సు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆలీ తల్లి మరణవార్త తెలిసి సినీ పరిశ్రమలోని ఆయన సన్నిహిత వర్గాలు కలత చెందాయి.

     హుటాహుటిన హైదరాబాద్ వచ్చిన ఆలీ

    హుటాహుటిన హైదరాబాద్ వచ్చిన ఆలీ

    ఇటీవలే ఓ షూటింగ్ నిమిత్తం రాంచీ వెళ్లారు ఆలీ. అక్కడ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయనకు ఈ వార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ బయలు దేరారు. అలాగే ఆలీ తల్లి జైతున్‌ బీబీ భౌతికకాయాన్ని కూడా రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ లోని ఆలీ నివాసానికి తీసుకొచ్చారు.

    పెద్ద ఎత్తున సినీ సెలెబ్రిటీల నివాళులు

    ఆలీ తల్లి జైతున్‌ బీబీ మరణ వార్త తెలిసి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆలీకి అత్యంత సన్నిహితులైన సెలెబ్రిటీలు స్వయంగా వచ్చి ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆలీ నివాసానికి చేరుకొని ఆలీ కుటుంబ సభ్యులని పరామర్శించారు. జైతున్‌ బీబీ మృత దేహానికి ఘన నివాళి అందించారు.

    పవన్ కళ్యాణ్ నోట్..

    పవన్ కళ్యాణ్ నోట్..

    ఆలీ తల్లి మరణ వార్త తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సందేశం పోస్ట్ చేస్తూ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆలీ తల్లి జైతున్‌ బీబీ మరణవార్త విని చాలా బాధేసిందని, ఆవిడ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలుసని పేర్కొన్నారు. ఈ మేరకు సినీ ప్రేక్షకులు కూడా ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

    హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు

    హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు

    గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆలీ తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఆలీకి తన తల్లిదండ్రులంటే చాలా ప్రేమ ఉండేది. పలు సందర్భాల్లో తన ఉన్నతి తల్లిదండ్రులే ప్రధాన కారణమని కూడా ఆలీ తెలిపారు.

    English summary
    Comedian Ali Mother Passed away with age related problem. Chiranjeevi, Pawan Kalyan puts their condolence on her death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X