చిరు, పవన్ కాంబినేషన్‌లో సినిమా.. త్రివిక్రమ్ దర్శకుడు.. మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్

మెగా బ్రదర్స్‌ను ఒకే చిత్రంలో నటింపచేసే మల్టీ స్టారర్ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి నిర్మాతగా సీ అశ్వినీదత్ వ్యవహరించనున్నారు.

By Rajababu

తెలుగు సినీ ప్రేక్షకులకు పండుగ లాంటి వార్త. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామనే అభిమానులకు తీపికబురు. మెగా బ్రదర్స్‌ను ఒకే చిత్రంలో నటింపచేసే మల్టీ స్టారర్ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి నిర్మాతగా సీ అశ్వినీదత్ వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనున్నది. ఈ చిత్ర వివరాలను సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త టీ సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు.

మెగా బ్రదర్స్ కలయికతో వారి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఈ చిత్రంతో తెరపడే అవకాశముంది. కొన్నినెలలుగా చిరంజీవి, పవన్ కల్యాణ్ సినీ కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు లేకపోవడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. అభిమానులను కొంత ఇబ్బందికి గురిచేసింది. తాజాగా మెగాస్టార్, పవర్ స్టార్ ఒకే చిత్రంలో నటిస్తున్నారనే వార్తతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.

Chiranjeevi, Pawan Kalyan to act in Trivikram movie

అయితే ఈ చిత్రం చిరంజీవి 151వ చిత్రంగా రూపుదిద్దుకుంటుందా లేక 152వ చిత్రంగా వస్తుందా అనే విషయంపై స్పష్టత లేదు. ఇంతకు ముందు అనుకున్న ప్రకారం త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X