చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పైకి?
హైదరాబాద్: మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. మరో వారంలో షూటింగ్ పూర్తి చేసుకుని యూనిట్ మొత్తం హైదరాబాద్ రాబోతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం ఆడియో అక్టోబర్ 4న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని భావిస్తున్నారు. ఇద్దరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ కలిసి వేదిక పంచుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఆ మధ్య ‘ముకుంద' ప్రారంభోత్సవంలో ఇద్దరూ పాల్గొన్నప్పటికీ వేదిక పంచుకోలేదదు. తొలుత పవర్ కళ్యాణ్ వచ్చి వెళ్లిన తర్వాత చిరంజీవి వచ్చారు.

ముకుంద
‘ముకుంద' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. లియో ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

వరుణ్
వరుణ్ తేజ్ ఈచిత్రంలో లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తోంది.

వరున్ తేజ్ పెర్ఫార్మెన్స్
సాధారణంగా తొలి సినిమా అనగానే పెర్ఫార్మెన్స్ పరంగా కాస్త పూర్‌గా ఉంటారు. అయితే వరుణ్ తేజ్ మాత్రం యాక్టింగ్, డాన్స్ తదితర అంశాల్లో చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడట. పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్నవాడిలా వీలైనంత వరకు ఎక్కువగా టేకులు తీసుకోకుండా పర్‌ఫెక్టుగా చేస్తున్నాడట.

ఇతర విషయాలు
ఇతర వివరాలు ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











